పెళ్లి చూపులు -18
తనని అన్ని మాటలు అంటున్నా తన తల్లిదండ్రులు ఇద్దరు ఎందుకు నోరు తెరవడం లేదో తెలియటం లేదు మహాలక్ష్మికి.
“అమ్మ నాన్న ఏమైంది? ఆవిడ ఎందుకు నన్ను అన్ని మాటలు అంటున్నారు. మీరిద్దరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు” అని తన తల్లి తండ్రి ఇద్దరి ముందుకు వచ్చి అడిగింది.
భార్గవ్ చాలా కోపం అంతకుమించి అసహనం, కళ్ళల్లో ఉన్న బాధతో మహాలక్ష్మి వైపు ఒక్క చూపు చూసి ఇంటి లోపలికి వెళ్ళిపోయారు కనీసం కూతురితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా,
భారతి మాత్రం కోపంగా మహాలక్ష్మి చెంప మీద ఒక్కటి పీకి “ఎక్కడికి వెళ్ళిపోయావు..?” అని అడిగింది..
సైకిల్ పక్కన పెట్టి అక్కడ ఉన్న జనాన్ని అందరినీ కూడా దాటుకొని, తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన వైష్ణవ్ కి అప్పుడే భారతి మహాలక్ష్మిని కొట్టడం చూసి ఆంటీ అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు వైష్ణవ్.