పెళ్లి చూపులు -46
ఆమె సారీ ని యాక్సెప్ట్ చెయ్యను కూడా ఇష్టం లేదు అన్నట్లుగా ఫేస్ పక్కకు తిప్పుకున్నారు ఇద్దరు.
వాళ్ళు అలా తనని చూసి ఫేస్ పక్కకి తిప్పుకోవడం గౌతమి తట్టుకోలేకపోయింది.
అలా అందరూ టీ తాగడం కంప్లీట్ అయిపోవడంతో గౌతమి నువ్వు చేసిన పనికి కచ్చితంగా నీకు పనిష్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు కాదు రేపు ప్రాజెక్ట్ సబ్మిషన్ అయిపోయిన తరువాత అని సీరియస్గా అన్నాడు వైష్ణవ్.
ఆ పనిష్మెంట్ కి నేను సిద్ధమే అన్నట్లుగా తలదించుకుని అలానే నిలబడింది గౌతమి..
అలా నలుగురు ముందుకు వెళ్ళిపోతుంటే గౌతమి వైష్ణవ్ అంటూ అతడిని ఆపింది.