పెళ్లి చూపులు -58
ఆ తర్వాత బ్రోకర్ ద్వారా రమ్య వాళ్ళ పేరెంట్స్ ని కలిసి మా పేరెంట్స్ మాట్లాడారు.. వాళ్ళు కూడా నాతో పెళ్లి చేయడం ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పారు.. అలా మా ఇద్దరి పెళ్లి అరేంజ్డ్ మ్యారేజ్ లా ఫిక్స్ అయిపోయింది అని చెప్పాడు.
“లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనేది సెకండరి, మన మనసుకు నచ్చిన వ్యక్తిని మనం పెళ్లి చేసుకుంటున్నాం. అది అసలైన ఆనందం” అని రవి బుజం చుట్టూ చేతిని వేసి అన్నాడు వైష్ణవ్.
“నిజమే బ్రో, రమ్యకి ఇదంతా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశాను. పెళ్లిచూపులో నన్ను చూసిన తర్వాత తన ఆనందం అంతా ఇంతా కాదు. తన కళ్ళల్లో కనిపించిన ఆ ఆనందం ఇప్పటికీ నాకు గుర్తుంది. తన ఆనందం కోసం ఏమైనా చేయొచ్చు అని ఆ క్షణం నాకు అనిపించింది” అని గుండె మీద చేతులు పెట్టుకుని చెప్పాడు రవి
“ఎలా అయితేనే త్వరలో ఒక ఇంటి వాడివి అవుతున్నావ్. వన్స్ అగైన్ కంగ్రాట్స్” అని చెప్పి “సర్లే జర్నీ చేసి వచ్చావు కదా అలసిపోయి ఉంటావ్. వెళ్లి ఫ్రెష్ అయ్యి రా ..! నీకోసం ఈరోజు నేనే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను” అని చెప్పి వైష్ణవ్ కిచెన్ లోపలికి వెళ్ళిపోయాడు