నిత్విక్ ప్రణతి వాళ్ళు ఎంతో ఆనందం గా ఉంటారు…. అరవింద్ కలెక్టర్ అయినందుకు అందరు సంతోషం గా మాట్లాడుకుంటు ఉంటారు….
ఇంకొకరు ఆ ఇంటర్వ్యూ చూసి వీడు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు అంటే అందరి గుట్టు బయట పెడతాడు అని భయ పడుతు ఉంటారు…
ఇక్కడ ప్రణతి వాళ్ళు ఎదో పని చేసుకుంటు ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మొగిద్ది…. అది విని గ్రీష్మ వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి…. ఎదురు గా ఎవరినో చూసి పెద్దగా అరుస్తూ ఉంటుంది అందరిని రమ్మని…. అందరు హడావిడి గా వెళ్తారు ఏమైందో ఏమో అని ఎదురు గా ఉన్నవాళ్ళని చూసి వాళ్ళు కూడా అలాగే షాక్ తో చూస్తూ ఉండి పోతారు….