New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 7

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 7

అరవింద్ అక్కడ అంత వెతికిన ఎటువంటి క్లూ కూడా దొరకదు వాళ్ళు ఎవరో కనిపెట్టడానికి అలా తిరిగి తిరిగి విసుగొచ్చి ఇంక ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడు…

 

అలా కార్ ఎక్కబోతు ఉండగా రోడ్ మీద ఎదో కనిపించి కనిపించినట్టు గా కనిపిస్తు ఉండిద్ది అది ఏంటో అని చేతికి తీసుకొని చూస్తాడు అది ఒక ఫోన్ అది తీసుకొని చూసి అది ఎవరిదో ఏంటో అని తీసి జాగ్రత్త చేసి మారసటి రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫోన్ ఇచ్చేయాలి అని అనుకుంటూ అప్పటికే కాస్త చీకటి మొదలు అవుతుండడం తో ఇంక ఇంటికి వెళ్ళాలి అనుకోని బయలుదేరతాడు….

 

 

ఇక్కడ ముగ్గురు బార్ లో కూర్చుని తాగుతు ఉండగా అప్పటికే చాలా టైం అవుతుండడం తో వెయిటర్ వచ్చి బిల్ ఇస్తాడు అందులో ఒకడు ఉండరా నేను ఇస్తాను అని జేబులో చేయి పెట్టుకుని చూస్తుండగా సడన్ గా అప్పుడే గుర్తొచ్చిద్ది ఫోన్ మిస్ అయ్యింది అని పక్కన ఉన్న వాడితో రేయ్ నా ఫోన్ కి ఒకసారి రింగ్ ఇవ్వరా ఎక్కడ ఉందొ ఏమో అని అంటాడు పక్కన ఉన్న అతను ఫోన్ చేసి చూడగా అది స్విచ్ ఆఫ్ వస్తూ ఉండిద్ది అదే విషయం ఇతని తో చెప్పగా షిట్ ఇప్పుడు ఎలా రా అది ఎక్కడ మిస్ అయ్యిందో ఏమో దానికి ఒక ఇంపార్టెంట్ ఫోన్ వచ్చిద్ది రా అని అంటాడు….

 

దానిలో ఏముంది రా నా ఫోన్ నుంచి చేసుకో అని చెప్పి ఇస్తాడు లేదు రా నాకు నెంబర్ గుర్తులేదు అని చెప్పి తడబడుతూ ఉంటాడు పక్కన ఉన్న వెయిటర్ సార్ అని పిలవగా అప్పుడు గుర్తొచ్చిద్ది అతను ఉన్న విషయం ఇంక ఎంత అయ్యిందో తెలుసుకొని మనీ పే చేసి బయటకు వస్తారు….

 

ఇక్కడ నిత్విక్ దగ్గర నివిత మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే నిద్ర పోయిద్ది ఇంక నిత్విక్ తనని సరిగ్గ పడుకోబెట్టి దుప్పటి కప్పి ఫ్యాన్ అండ్ ఏసీ వేసి లైట్స్ ఆఫ్ చేసి బయటకు వస్తాడు ఇక్కడ నిత్విక్కి తెలియని విషయం ఏంటంటే….

 

నివిత చేత కావాలని అలా మాటల్లో పెట్టించేలా చేసి గ్రీష్మ పెళ్ళీ చూపులు జరపాలి అనుకుంటారు రత్న ప్రభ గారు అందుకే రిత్విక్ ని కూడా ఎదో అవసరం అయినవి ఉన్నాయి అని చెప్పి బయటకు పంపించేసిద్ధి….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue