New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసు మెచ్చిన వయ్యారి – 5

మనసు మెచ్చిన వయ్యారి – 5

అలా అందరి బంధువుల మధ్య ఆ దేవుని ఆశీస్సులతో….. మూడు ముళ్ళతో ముడిపడి ఏడడుగులు తో ఏడు జన్మల బంధం గా మారి ఆదర్శ్ ఆశ్రిత ల వివాహం పూర్తవుతుంది 

 

 

ఆ క్షణం సత్యదేవ్ సుచిత్ర దంపతుల కళ్ళల్లో సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది…. ఎన్నో ఏళ్ళు గా వాళ్లలో వాళ్లే ఎంతో నలిగిపోయారు ఎంతో మధన పడ్డారు కానీ కొన్ని రోజుల తర్వాత భగవంతుడు దయవల్ల యోక్షిత రాకతో వారి జీవితాలలో సంతోషం వెదజల్లింది 

 

 

అదే యోక్షిత ఈరోజు పెళ్లికూతురుల ముస్తాబై పెళ్లి పీటల మీద ఇంకొకరికి భార్య స్థానంలో వెళ్లిపోయింది అని అనుకోగానే కొంచెం బాధ అంతలోనే ఆనందం ఇలా రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ లో కళ్లనిండా నీళ్లతో ఆనందంగా చూస్తూ ఉండిపోతారు ఆ కొత్త  దంపతులిద్దరిని

 

 

పాపం వారి కూతురు పెళ్లి జరిగిపోయిందని మురిసిపోతున్న దంపతులకు ఆ కూతురు స్థానంలో ఆయన తమ్ముడు కూతురితో పెళ్లి జరిగిందని తెలిస్తే వాళ్ళ  రియాక్షన్ ఎలా ఉండబోతుందో 

 

 

అప్పుడు కూడా ఇదే సంతోషం ఉంటుందా? నా కూతురు ఏం తప్పు చేసింది అని ఆలోచిస్తారా లేక తమ్ముడు కూతురి దే తప్పని భావిస్తారా తెలుసుకోవాలి మనం కూడా 

 

 

ఎవరి ముందు తలదించుకోకుండా పెళ్లి చాలా చక్కగా జరిగిపోయింది ఎవరికి ఏ లోటు రాకుండా అన్ని సమకూర్చాము అని గర్వంగా ఉప్పొంగి పోతారు హరి నారాయణ  గారు 

 

 

కానీ అదే పెళ్లి మండపంలో భోజనాలు లైటింగులు విందు వినోదం ఇలా వచ్చిన వాళ్లందరికీ సకల సౌకర్యాలు సరిగా అమర్చారు కానీ పెళ్లికూతురు స్థానంలోనే పెద్ద తప్పు జరిగిపోయింది అనే సంగతి ఆయనకు తెలిస్తే ఎలా ఉంటుందో పరిస్థితి

 

 

నీలు చూడు మన యోక్షీ పెళ్లి ఎంత బాగా జరిగిందో ఎప్పటినుంచో ఈ పెళ్లి పనుల కోసం ఎన్నో ఆలోచనలు ఎలా జరుగుతుంది ఏంటి అని ఒక భయం దిగులు ఉండేవి 

 

 

కానీ ఇప్పుడు చూడు మన యొక్షీ సంతోషం కనిపిస్తుంది నాకు ఈ పెళ్లిలో అని అక్కడ స్టేజ్ మీద ఉన్న పెళ్లికూతురు వైపు సంతోషంగా చూస్తూ అంటారు కామేష్ గారు

 

 

అవును నాకైతే అక్కడ యోక్షి స్థానంలో ఆశు ఉందా అన్నట్టు కనిపిస్తుందండి నా కళ్ళకి అని అంటున్న నీలిమా గారి మాటలకు అదేంటి అక్కడ ఉన్నది యోక్షినే కదా ఆశల ఎందుకు కనిపిస్తుంది అని విచిత్రంగా చూస్తూ అంటారు కామేష్ గారు 

 

 

హా అదే అదే మన ఆశు కూడా రేపు పొద్దున్న ఇంత సంతోషంగా ఉంటే చాలు అని అంటున్నాను అని తడబడుతూ అంటారు నీలిమ గారు 

 

 

ఓహో అవును రేపు మన ఆశు పెళ్లి కూడా ఇంతకన్నా వైభవంగా ఇంతకన్నా గొప్పగా చేస్తాను నేను… నా కూతురు పెళ్లి తను ఎప్పటికీ మర్చిపోలేని విధంగా జరిపిస్తాను అని గర్వంగా అనుకుంటారు కామేష్ గారు 

 

 

కానీ ఆయనకేం తెలుసు ఆయనకే తెలియకుండా ఆయన కూతురు పెళ్లి జరిగిపోతుందని ఆ క్షణం ఊహించలేకపోయారు 

 

 

రేపు కూతురు పెళ్లి అయిపోయిందని సంగతి తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉండబోతుందో….. అంగరంగ వైభవంగా జరగాలనుకుంటున్న తన కూతురు పెళ్లి తనకే ఇష్టం లేకుండా జరుగుతుందని ఊహించి ఉండరు

 

 

                @@@@@

 

 

పోనీలే పెళ్లి ఏ ఆటంకం లేకుండా వాళ్ళకి చేసిన మర్యాదలలో ఎటువంటి లోటు రాకుండా చాలా సవ్యంగా సంతోషంగా జరిగిపోయింది కదా అని అంటారు హరి నారాయణ గారు అక్కడే ఉన్న కొడుకులు కోడళ్ళు అందరి వైపు చూస్తూ 

 

 

అవును నాన్న ఎలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వాల్సి వస్తుందో ఎలాంటి ఇంటికి కోడలుగా వెళుతుందో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు జీవితం ఎలా ఉండబోతుందో అని రకరకాలుగా ఆలోచించిన మాకు ఈరోజు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది అని అంటారు సత్యదేవ్ గారు కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిందని మురిసిపోతూ 

 

 

అవునండి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చూశారా నిన్నటి వరకు ఎంతో గారాబంగా పెరిగి ఇంట్లో అందరితో అల్లరి అల్లరి చేసి చిన్నపిల్లల తిరిగిన మన కూతురు ఈరోజు మండపం మీద సిగ్గు తో దించిన తల కూడా ఎత్తలేదు అప్పుడే చాలా మార్పు వచ్చేసింది నా కూతుర్లు అని నవ్వుతూ అంటారు సుచిత్ర గారు 

 

 

పాపం ఆ క్షణం వాళ్ళు ఊహించలేదు…అక్కడ ఉన్నది తమ కూతురు కాదని తన స్థానంలో తమ్ముడి కూతురు ఉందని

 

 

తెలిసిన క్షణం ఎన్ని మనస్పర్ధలు మొదలవుతాయో…!! ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో ముందు ముందు కథలో తెలుసుకుందాం.

 

 

స్టోరీ కంటిన్యూస్….

 

 

మరి అనుకోకుండా జరిగిన ఈ పెళ్లి ఇరు కుటుంబాలు లో ఎలాంటి సంబంధాలు తీసుకు వస్తుందో…??

 

 

ముడిపడిన ఆ జంట భవిష్యత్తు ఏంటి…?? తను మనసు పడిన అమ్మాయి కాదు అని ఆదర్శ్ కి తెలిసిన క్షణం ఏమవుతుందో …?? తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీని మీస్ అవ్వకుండా చదివేయండి 

 

 

ప్లీజ్ ట్యాగ్ యువర్ రేటింగ్స్ అండ్ కామెంట్స్ ఫ్రెండ్స్… మీ అభిప్రాయం చెప్తేనే కదా తెలిసేది.