ఐదు సంవత్సరాలు నాతో కాపురం చేసిన నా పెళ్ళానికి నా గురించి పూర్తిగా తెలియదు. డబ్బులు ఇచ్చిన వాడికి తెలియలేదని మీరు ఫీల్ అవుతున్నాడు ఏంట్రా.. వాడేమైన తోపా లేక తొండం పెరిగిన ఎనుబోతా..??
నన్ను కొట్టడానికి తీసుకున్న డబ్బులు తో పాటు హాస్పిటల్ బిల్ కూడా కలెక్ట్ చేసుకోండి.. అని ఆల్రెడీ మండుతున్న ప్రస్స్టేషన్ తో ముందు అరిచినోడిని ఆ తర్వాత అడిగిన బాస్ ని వాయ పీకి ఇద్దరి మాడు కొబ్బరికాయలు లెక్క రీసౌండ్ వచ్చేలా దగ్గరికి కొట్టాడు.
రీ సౌండ్ తో తల పట్టుకొని నేలకు కూలిన ఇద్దరు తిరిగి కళ్ళు తెరిచేది లేదు.
బాస్ పడిపోయాడు అని అరుస్తూనే మరింత రెచ్చిపోయిన వాళ్ళ బోన్స్ బ్రేక్ చేస్తున్న అర్జున్ ని ఆటో సైడ్ నుంచి ఫాస్ట్ గా వచ్చిన వాడు వెనకనుంచి తలమీద కొట్టాడు.