New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 105

మాంగళ్య బంధం – 105

ఆమె సపోర్టు కోసం కూడా పట్టుకుని కూర్చోవడం చూసిన ప్రణయ్  ఇంక తను పడిపోదులే అన్న నమ్మకం కలగడంతో బసవ,నంది   (ప్రణయ్ ఎడ్ల పేర్లు అవి )కదలండి అని చెప్పడంతో వెంటనే ఆ ఎడ్లు ఏదో మనుషుల్లానే  ప్రణయ్ మాటలు అర్ధం అయినట్టుగా తల ఆడించి  ముందుకు కాస్త వేగంగా కదులుతాయి..

 

ఆ దృశ్యాన్ని చూసిన ప్రతిమకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది.. ఇదేంటి ఈ ఎద్దులు ఇతను ఏం చెప్తే అదే చేస్తున్నాయి..

 

ఎడ్లకు కూడా మనుషుల భాష అర్థం అవుతుందా.. లేదంటే నేనేదైనా భ్రమ పడుతున్నానా  అని తనలో తన అనుకుంటూ ప్రణయ్ వంక ఎద్దుల వంక మార్చి మార్చి చూస్తూ ఉంటుంది..

 

కానీ ఆ ఎడ్లు మాత్రం నిజంగానే ప్రణయ్ ఏది చెప్తే అదే చేస్తూ ఎటు తిరగమంటే అటే తిరుగుతూ పోతున్నాయి ముందుకు..

 

మొదట్లో తను భ్రమ పడింది అనుకుంది కానీ పోయే కొద్ది ఆ ఎడ్లు నిజంగానే ప్రణయ్ చెప్పిన మాట వినడం చూసి  బాబోయ్ ఇతనికి మనుషులతోనే కాదు ఎద్దులతో కూడా మాట్లాడడం వచ్చా..

 

ఆ ఎడ్లు కూడా ఏంటో ఇతని మాట భలే వింటున్నాయిగా..నేనెప్పుడూ మూగ జంతువులు ఒక మనిషి చెప్పిన మాట వినడం నేను చూడనే లేదు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue