New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 108

మాంగళ్య బంధం – 108

భరత్ మాత్రం ప్రతిమకి సపోర్ట్ చేస్తూ తను ఆడపిల్ల ముందు తను తినిపించడం ఏంటి? మీ అబ్బాయి మగ మహారాజు కదా అందులోను మీ అబ్బాయికి అలాంటి భయం, బిడియం,సిగ్గులేవు అదే అదే  సిగ్గు పడడు కదా..

 

అందుకే ముందు మీ అబ్బాయిని మా అమ్మాయికి తినిపించమని చెప్పండి .. మీ అబ్బాయి తినిపించిన తరువాత మా అమ్మాయి కచ్చితంగా తినిపిస్తుంది..

 

ఎలానో మీ ఇంటి దగ్గర మా అమ్మాయే కదా ముందు  ఇద్దరి పేర్లు చెప్పి ఇంట్లోకి వచ్చింది..  ఇప్పుడు ఇది మా ఇల్లు సో మీ అబ్బాయి ముందు తినిపిస్తే ఆ తర్వాత మా అమ్మాయి తినిపిస్తుంది అని అంటాడు..

 

వెంటనే ఆ పెద్దాయన కల్పించుకుని ఆ విషయం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులే అల్లుడు మా అబ్బాయికి ఏమైనా భయమా ఏంటి  ప్రణయ్ బాబు కానివ్వు కోడలు పిల్లలకు ముందు నువ్వే తినిపించి మన సత్తా ఏంటో నిరూపించు..

 

ఈ అల్లుడు బాబు ఇందాక నుంచి తెగ నీలుగుతున్నాడు..ఇదేదో పెద్ద బ్రహ్మవిద్య అన్నట్టుగా మాట్లాడుతున్నాడుగా అనడంతో ఇంక చేసేది ఏమీ లేక  వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటే తప్ప వాళ్ళు ఎవరూ వాళ్ళని వదలరు అని అర్థం చేసుకున్న ప్రణయ్ ఒకసారి ప్రతిమ వంక చూసి అరిటాకులో నుంచి ముందుగా స్వీట్ ని తీసుకుని  ప్రతిమ నోటి ముందు తన చేతిని తీసుకెళ్లి పెడతాడు..

 

ప్రణయ్  స్వీట్ ని తీసుకెళ్లి ప్రతిమ ముందు ఉంచగానే  అది చూసినా పెద్దాయన చూసావా అది మా అబ్బాయి అంటే అన్నట్టుగా   భరత్ వైపు చూస్తు కళ్ళ ఎగరేసి సైగ చేస్తాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue