New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 26

మాంగళ్య బంధం – 26

అబ్బా అమ్మ మీరు నాకు పెళ్ళి చేస్తాను అన్నది నేను వద్దు అని నీకు చెప్పింది అప్పుడెప్పుడో కదా.. మళ్ళీ ఆ ఊసే మీరు ఎత్తలేదు గా..

 

నేను టూర్ కి వెళ్లే  ముందు కూడా పెళ్ళి మాటే  నా దగ్గర ప్రస్థావించింది లేదు… నాకు పెళ్ళి చెయ్యాలి అని మీరు అనుకున్నప్పుడు కనీసం పెళ్ళి చేసుకోబోయే నాకు ఒకమాట చెప్పాల్సిన అవసరం లేదంటావా అని తిరిగి ప్రశ్నిస్తుంది ప్రతిమ..

 

నువ్వు టూర్కి వెళ్లక ముందే నీ పెళ్ళి మాటలు జరిగాయి మా మధ్యలో… ఆ విషయం నీకు చెప్పాలి అని కూడా అనుకున్నాను..

 

కానీ నువ్వే నాకు ఆరోజు అవకాశం ఇవ్వకుండా వెళ్లి నిద్రపోయావు.. తర్వాత రోజు ఉదయాన్నే బ్యాగ్ సర్దుకుని వచ్చి టూర్ కి పోయావు అంటు ఆమె ఏరోజు చెప్పాలి అనుకుందో కూడా ఎక్సప్లన్ చేస్తారు శాంతి..

 

తల్లి మాటలు విన్న తరువాత ఆరోజు తల్లి తనతో ఏదో మాట్లాడాలి అనుకుంటుందని తనకి అనిపించిన అవేవో నార్మల్ మాటలు అయుంటాయని వాటిని ఈరోజు కాకుంటే రేపయిన వినొచ్చులే అని తను వెళ్లి  పడుకోవడం గుర్తు తెచ్చుకుని నీకు బుద్ది లేదే ప్రతిమ  ఆరోజు కాస్త ఓపిక చేసుకుని నువ్వు మీ అమ్మ నీ విషయం ఏంటి అని  అడిగి వున్న లేదా కాసేపు అక్కడే కుర్చుని వున్న విషయం ఏంటో అప్పుడే తెలిసేది అని తనని తను మనసులోనే తిట్టుకుంటుంది..

 

 

ఆ తరువాత జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు తలచుకుని బాధ పడిన ప్రయోజనం ఏమి  లేదని తనకి తనే సర్ది చెప్పుకుని  సరే అమ్మ తప్పు నాదేలే నేను ఒప్పుకుంటున్నాను..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue