New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 27

మాంగళ్య బంధం – 27

చిన్నప్పటి నుండి ప్రతిమ నీ వాళ్ళు ఎంతో గారంభం గా పెంచిన సరే పద్ధతి గానే పెంచారు…నోటిని అదుపులో పెట్టుకుని ఎక్కడ ఎలా ఉండాలో అన్ని నేర్పుతూనే పెంచారు..

 

ప్రతిమ కూడా బేసిగ్గా చాలా మంచిది.. కాకపోతే ఆమె కీ కాస్త ఆశలు, కోరికలు ఎక్కువ.. పల్లెటూర్ల కంటే పట్నాల మీద మోజు ఎక్కువ..

 

 

ఆ ఆశ వలనే జాబ్ చేస్తూ పట్నం లో వుండే అబ్బాయిని పెళ్ళి చేసుకుని పట్నం వెళ్ళిపోయి సీటీ లైఫ్ నీ ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటుంది..

 

అలాంటి ఆశలతో వున్న ప్రతిమ కలల మీద నీళ్లు జల్లెల తన పేరెంట్స్ ఆమెకి వ్యవసాయం చేసే సంబంధం చూసారు అనడం తో ఎక్కడ ఈ పెళ్ళి జరిగితే తన కళ నెరవేరదో అన్న బాధలో తన సంస్కారాన్ని మర్చిపోయి ఎవరి గురించి ఎవరి ముందు మాట్లాడుతుందో గుర్తించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడింది..

 

అంతేకాని ప్రతిమ ఏమి సంస్కార హీనురాలు కాదు..

 

కూతురు ఆవేశం లో, ఆలోచన లేకుండా, విచక్షణ మరిచిపోయి మాట్లాడిన మాటలు ఏ  మాత్రం నచ్చని శాంతి గారు హేయ్ ప్రతిమ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అయిన అర్ధం అవుతుందా ఇదేనా మేము నీకు నేర్పించిన సంస్కారం…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue