New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 68

మాంగళ్య బంధం – 68

ఫస్ట్ టైమ్ ప్రణయ్ని చూడడం ప్రతిమ.. చిన్నప్పుడు ఎప్పుడో చూడడం తప్ప  అతను పెద్దయ్యాక అతన్ని మళ్ళీ ఆమె చూసిందే లేదు..

 

తన ముందు నుండి వెళ్తున్న ప్రణయ్ ని చూసిన ప్రతిమ  మొహంలో రంగులు మారిపోయాయి.. వెళ్తున్న ప్రణయ్ వంకే వికారంగా మొహం పెట్టి చూస్తూ ఏంటి నేను ఇతనినా పెళ్లి చేసుకోబోయేది..

 

ఇతనేంటి ఇలా ఉన్నాడు? ఆ మొహం ఏంటి, ఆ వాలక మేంటి,అతను వేసుకున్న డ్రెస్ ఏంటి? ఛీ ఛీ ఇలాంటి వాడితోనా నాకు పెళ్ళి ఫిక్స్ చేసింది అని అనుకుంటుంది..

 

అంతక ముందు వరకు ప్రణయ్ ని కేవలం ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తి గా మాత్రమే అయిష్టంగా చూసేది..

 

కానీ ఇప్పుడు ప్రణయ్ ఉన్న అవతారాన్ని చూసి నాలో సగం కూడా అందంగా లేడు.. నాతో పాటు చదువు లేదు నాకు తగ్గ వరుడు కాదు..

 

నాకు ఎందులోనూ సమానంగా లేని ఈ వ్యక్తిని నేను పెళ్లి చేసుకొని జీవితాంతం ఈ పల్లెటూరులో పడి ఉండాలన్నమాట..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue