ప్రతిమ తనతో ఎలా ఉన్నా సరే, ఇంట్లో వాళ్లతో మాత్రం బాగానే ఉంటుందని ఈ కాసేపట్లోనే అర్థమైన ప్రణయ్ ఇప్పటికి ఇదే సంతోషం అనుకుంటాడు..
ప్రణయ్ ఒక వైపే చూస్తూ ఉండడం గమనించిన స్వీటీ ఏంటి మావయ్య అలానే చూస్తూ ఉన్నావు ఏముంది అక్కడ అని అమాయకంగా మొహం పెట్టి అడిగింది..
స్వీటీ మాటలకి కొడుకు వైపు చూసినా యశోద గారికి కొడుకు తన గది వైపే చూడడం గమనించి ప్రతిమ కోసం అలా చూస్తున్నాడని ఆవిడ ఏదో ఊహించుకొని తనలో తను ముసి ముసిగా నవ్వుకుంటారు..
ప్రణయ్ మాత్రం వెంటనే తల తిప్పేసి ఏమీ లేదు బంగారం తమ్ముడు నిద్రలేచాడు కదా.. అమ్మ ఇంకా ఏంటి వాడిని ఎత్తుకొని బయటికి రాలేదని చూస్తున్నాను అంతే..
నువ్వైతే నిద్ర లేవగానే రూమ్ లో నుండి బయటికి వచ్చేసావు కదా.. తమ్ముడు నీకంటే చిన్నవాడు కాబట్టి అమ్మానాన్న నువ్వు ఎవరు కనపడలేదని కాస్త భయపడి ఉంటాడు..
ఎంతైనా నువ్వు చాలా ధైర్యవంతురాలివి బంగారం.. తమ్ముడు కూడా నీ అంత ధైర్యంగా ఉండాలి అంటూ మేనకోడలి బుగ్గల్ని పునుకుతూ హ్మ్ ఇప్పుడు చెప్పు ఏం తాగుతావు మరి పాలు కాచివ్వమంటావా నీకు..