హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నా, బయటి ప్రపంచానికి ఏ మాత్రం సంబంధం లేనట్టుగా ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది భూపతిస్ విల్ల.
అది కేవలం ఇల్లు కాదు, భూపతి వంశస్తుల కుటుంబం యొక్క శక్తికి అది ఒక నిలువుటద్దం. ఆ ఇంటి సింహద్వారం దగ్గర నిలబడితేనే ఒక రకమైన వణుకు పుడుతుంది.
సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు, ఆ గేట్లు భారీ శబ్దంతో తెరుచుకున్నాయి. ఇషాంత్ తన బ్లాక్ రేంజ్ రోవర్‌ని మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తూ లోపలికి వచ్చాడు.
టైర్లు నేలని రాచుకుంటూ చేసిన శబ్దం ఇల్లంతా ప్రతిధ్వనించింది.ఇషాంత్ కారు దిగి, తన చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌ని సర్దుకుంటూ లోపలికి నడిచాడు.
లోపల హాల్లో ఇటాలియన్ మార్బుల్స్ మెరుస్తున్నాయి. గోడల మీద పూర్వీకుల భారీ చిత్రపటాలు ఉన్నాయి. సోఫాలో తన తల్లి సుమిత్ర దేవి, ఆమె పక్కన పెద్దమ్మ దేవిక కూర్చుని ఉన్నారు.
సుమిత్ర దేవి ముఖంలో తన కొడుకు వచ్చాడన్న ఆనందం ఉన్నా, ఇషాంత్ ముఖంలో మాత్రం నిప్పులు కురుస్తున్నాయి.