New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 83

మిస్టర్ మాన్స్టర్ – 83

ఇషాంత్ అంత కఠినంగా, అంత కోల్డ్ వాయిస్‌తో మాట్లాడేసరికి మైరా కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి.

 

తన అమాయకత్వంతో, చిన్ననాటి ఫ్రెండ్స్ గురించిన ఉత్సాహంతో ఇషాంత్ మనసును ఎంతలా గాయపరిచానో ఆమెకు అప్పుడు అర్థమైంది. 

 

ఇషాంత్ తన ల్యాప్‌టాప్ స్క్రీన్ వైపు చూస్తూ కీబోర్డ్ మీద వేళ్లు కదిలిస్తుంటే, మైరా మెల్లగా అడుగులు వేస్తూ ఆయన పక్కన బెడ్‌పై వచ్చి కూర్చుంది. 

 

ఇషాంత్ కనీసం తన వైపు చూడకపోవడంతో మైరా మనసు విలవిలలాడిపోయింది.

 

ఆమె ఎంతో సున్నితంగా తన చేతిని చాచి, ఇషాంత్ టైప్ చేస్తున్న ఆ ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను చాలా మెల్లగా కిందికి క్లోజ్ చేసింది.

 

ల్యాప్‌టాప్ సడన్ గా క్లోజ్ అవ్వడంతో ఇషాంత్ తన వేళ్లను ఆపి, తీవ్రమైన కోపంతో, గంభీరమైన చూపులతో మైరా వైపు చూడబోయాడు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue