💘 𝑺𝒐𝒇𝒕 & 𝑹𝒐𝒖𝒈𝒉 𝑳𝒐𝒗𝒆 𝑺𝒕𝒐𝒓𝒚 💘-1 – 2
కానీ రుక్మిణి కి మాత్రం, లోపలికి వెళ్ళాలి అంటే,గుండె దడదడలాడుతుంది , కానీ తన తండ్రి కోసం ఈ జాబ్ చాలా అవసరం అని క్యాబిన్ లోపలికి అడుగు పెడుతూ….మే ఐ కమ్ ఇన్ సర్?” అంటూ చాలా నెమ్మదిగా, వినయంగా డోర్ నెట్టి లోపలికి అడుగుపెట్టింది రుక్మిణి………..
క్యాబిన్ అంతా ఏసీ చల్లదనంతో, బ్రాండెడ్ పర్ఫ్యూమ్ సువాసనతో కార్పొరేట్ లుక్‌లో అదిరిపోతోంది…. ఎంట్రన్స్ లోనే తల దించుకుని నిలబడిన రుక్మిణి….నెమ్మదిగా తలెత్తి, తను ఊహించుకున్న ఆ ‘దైవస్వరూపుడైన పెద్దాయన’ ఎక్కడున్నాడా అని వెతికింది…………
కానీ…అక్కడ రివాల్వింగ్ చైర్‌లో వెనుకకు తిరిగి కూర్చుని ఉన్న వ్యక్తి…నెమ్మదిగా కుర్చీ తిప్పాడు….
కుర్చీ తిరగగానే…రుక్మిణి కళ్లు ఒక్కసారిగా పెద్దవయ్యాయి…. నోట మాట రాలేదు, చేతిలో ఉన్న ఫైల్ మరోసారి కింద పడిపోయేంత పనైంది………….
అక్కడ కూర్చున్నది తను ఊహించుకున్న తెల్ల పంచె కట్టుకుని దేవదూతలా ఉన్న పెద్దాయన కాదు…బయట రోడ్డు మీద రౌడీని కాలర్ పట్టుకుని గాల్లోకి లేపి చెత్తకుండీలో పడేసిన అదే ‘రఫ్ అండ్ టఫ్’ మనిషి…. అని…అతనే……………
“మిస్టర్ విక్రమ్ రాథోడ్”మేనేజింగ్ డైరెక్టర్……
అని రుక్మిణి కి అర్ధం అయ్యి, అతని వైపు భయం గా చూస్తూ ముడుచుకు పోతోంది……….
అతను అప్పటికే తన సన్ గ్లాసెస్ తీసి టేబుల్ మీద పెట్టి… ఆ తీక్షణమైన చూపులతో రుక్మిణి వైపే చూస్తున్నాడు………..
రుక్మిణి మాత్రం వణుకుతున్న పెదవులతో, గుటకలు మింగుతూ వెనక్కి అడుగులు వేయబోయింది………..
విక్రమ్ ఆమె భయాన్ని గమనించాడు, అతని పెదవులపై చిన్న నవ్వు, నవ్వుతూ….టేబుల్ మీద ఉన్న పెన్నుతో ఆడుకుంటూ గంభీరమైన గొంతుతో ఏంటి… ఇందాక బయట ఢీకొట్టింది చాలదన్నట్టు…
ఇప్పుడు నా క్యాబిన్‌కి వచ్చి కూడా అలానే నిలబడిపోయావ్? ఇక్కడ కూడా నన్ను ఢీ కొట్టటానికి వచ్చావా…? అని కాస్త రఫ్‌గా, ఆటపట్టిస్తున్నట్టు అడిగాడు………..
విక్రమ్ చాలా సాఫ్ట్ వాయిస్ తో, అన్న ఆ మాటలు వినగానే రుక్మిణికి బాధ ఎక్కువ అయింది………..
ఆ బాధ లో అప్పటికే కంగారులో ఉన్న ఆమె కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి….ఆ కళ్ల నీళ్లు కంటి రెప్పల అంచున నిలిచి, మరుక్షణమే బుగ్గల మీదుగా జారిపోయాయి………
సార్… ని… నిజంగా నేను కావాలని డాష్ ఇవ్వలేదు అండీ… పొరపాటున జరిగిపోయింది సార్… అంటూ చేతులు జోడించి వెక్కిళ్లు పెడుతూ ఏడ్చేసింది………..
అలా ఏడుస్తూ నే నాకు సిటీ కొత్త సార్… ఇంటర్వ్యూ టైమ్ అయిపోతుందనే కంగారులో లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ చూసుకోలేదు…….
ప్లీజ్ సార్…నన్ను పోలీసులకి అప్పగించకండి… అసలే మా నాన్నగారికి హెల్త్ బాలేదు… అంటూ చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.
రుక్మిణి…………..
విక్రమ్ రుక్మిణి ని ఆటపట్టిద్దాం, అని రఫ్‌గా గా మాట్లాడాడు….కానీ విక్రమ్… రుక్మిణి ఏడుపు చూడగానే తన మనసు కలుక్కుమన్నది……….
బిజినెస్ ప్రపంచంలో ఎంతోమంది మొండివాళ్లను, రౌడీలను సైతం భయపెట్టిన విక్రమ్ రాథోడ్… ఈ పిల్లికూన కన్నీళ్ల ముందు పూర్తిగా కరిగిపోయాడు………….
రుక్మిణి చాలా సెన్సిటివ్ ,చాలా అమాయకురాలు
అని అతనికి బాగా అర్థమైంది…..తను సరదాగా అన్న మాటకి ఆమె ఇంతలా భయపడిపోతుందని అతడు ఊహించలేదు…………
విక్రమ్ వెంటనే తన కుర్చీలోంచి లేచి,రుక్మిణి వైపు వచ్చాడు….అతని నడకలో ఇందాకటి రౌడీయిజం లేదు, కేవలం ఒక సాఫ్ట్ నెస్ మాత్రమే ఉంది……..
హేయ్…ఆపు… ఫస్ట్ ఆ ఏడవడం ఆపు… నేను
నీతో ఏదో సరదాగా అన్నాను అని అన్నాడు విక్రమ్…..ఈసారి అతని గొంతులో గంభీరత్వం మాయమై, ఎంతో ఆదరణ, ఓదార్పు వినిపించాయి…..అతని మాటలు……….
తరువాత విక్రమ్ నెమ్మదిగా ఆమెకు ఇంకాస్త దగ్గరగా వచ్చి, టేబుల్ మీద ఉన్న టిష్యూ బాక్స్ నుంచి ఒక టిష్యూ పేపర్ తీసి ఆమెకు ఇచ్చాడు………..
ముందు ఈ కన్నీళ్లు తుడ్చుకో… నేను నిన్నేం అనడం లేదు. నిన్ను పోలీసులకి అప్పగించడానికి నేనేం విలన్‌ని కాదు, జస్ట్ సరదాగా అన్నాను… దానికి ఇంతలా ఏడ్చేస్తావా? అన్నాడు చాలా సాఫ్ట్‌గా………..
రుక్మిణి నెమ్మదిగా తల పైకెత్తి, కన్నీళ్ల వెనుక ఉన్న ఆ అమాయకపు కళ్లతో విక్రమ్ వైపు చూసింది… ఎప్పుడూ రఫ్‌గా ఉండే విక్రమ్ ముఖంలో ఇప్పుడు కనిపిస్తున్న ఆ సాఫ్ట్‌నెస్, ఆదరణ చూసి ఆమె ఏడుపు కాస్త తగ్గింది…వణుకుతున్న చేతులతో అతను ఇచ్చిన టిష్యూ పేపర్ తీసుకుని కళ్లు తుడ్చుకుంది………..
సారీ… నిన్ను భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. నువ్వు చాలా సెన్సిటివ్ అని నాకు అర్థమైంది. కానీ ఇంత చిన్న విషయానికే ఏడిస్తే…రేపు లైఫ్‌లో వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేస్తావ్?
నీ ఫైల్ చూశాను, నువ్వు గోల్డ్ మెడలిస్ట్‌వి, చదువులో ఉన్న ధైర్యం… నీ మనసులో కూడా ఉండాలి, సరేనా? అంటూ విక్రమ్ ఆమెకి ధైర్యం చెప్పి ఓదార్చాడు………..
To be continued…✍️
Swipe left/right or tap the sides to turn pages