మైరా టెర్రస్ మీద అడుగుపెట్టింది. చల్లటి గాలి వీస్తోంది, కానీ ఆ గాలిలో ఒక రకమైన శ్మశాన నిశ్శబ్దం ఉంది.
ముందు నిలబడిన వ్యక్తి వెనుకకు తిరిగి ఉన్నాడు. అతని రూపం, ఆ గంభీరమైన కదలికలు మైరాను ఏదో తెలియని భయానికి గురిచేశాయి.
పది నిమిషాల నిరీక్షణ తర్వాత, ఆ వ్యక్తి నెమ్మదిగా వెనక్కి తిరిగాడు.
ఆ ముఖాన్ని చూడగానే మైరా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. కాళ్లు వణుకుతున్నాయి.
అక్కడ నిలబడింది సామాన్యమైన వ్యక్తి కాదు.. భూపతి గ్రూప్స్ వారసుడు.. ఇషాంత్ భూపతి రాజు…
మైరా కళ్లు తెరిచి చూస్తోంది, కానీ నమ్మలేకపోతోంది. ఆమె నోరు పడిపోయింది, మాట పెగలడం లేదు.