మిస్టర్ మాన్స్టర్ – 4
వైజాగ్ నగరం.. సముద్రపు అలల ఘోష కంటే ఎక్కువగా ఇప్పుడు భూపతి మాల్ పరిసరాల్లో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది.
సిటీలోని అతిపెద్ద షాపింగ్ మాల్ అది. కానీ ఈరోజు సామాన్య జనానికి ఎంట్రీ లేదు. కారణం ఆ సామ్రాజ్యానికి అధిపతి, భూపతి ఇండస్ట్రీస్ సీఈఓ ఇషాంత్ భూపతి రాజు స్వయంగా తనిఖీకి వస్తున్నాడు.
మాల్ మేనేజ్‌మెంట్ అంతా గేటు దగ్గర చెమటలు కక్కుతూ నిలబడ్డారు. సరిగ్గా పది నిమిషాల తర్వాత, ఒక బ్లాక్ రేంజ్ రోవర్ కాన్వాయ్ మెరుపు తీగలా వచ్చి ఆగింది.
సెక్యూరిటీ గార్డ్స్ పరుగున వెళ్లి డోర్ తీశారు. ఇషాంత్ కారు దిగాడు. అతని ఆరడుగుల విగ్రహం, ఆ నల్లటి సూట్, ముఖం మీద అణువంత కూడా తగ్గని ఆ అహంకారం చూస్తుంటే..
అతను మనిషిలా లేదు, ఒక నడుస్తున్న పర్వతంలా ఉన్నాడు.అతని వెంటే అతని నమ్మకస్థుడైన పీఏ దిలీప్ ఫైల్స్ పట్టుకుని వస్తున్నాడు.
ఇషాంత్ లోపలికి అడుగు పెట్టగానే ఏసీ సౌండ్ తప్ప మరే శబ్దం వినిపించడం లేదు. మేనేజర్ వంగి నమస్కారం పెట్టబోతే,
ఇషాంత్ అతన్ని కనీసం కంటితో కూడా చూడకుండా నేరుగా తన పర్సనల్ క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు.
తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆ లగ్జరీ క్యాబిన్‌లోకి వెళ్లి, తన కోటు తీసి కుర్చీకి తగిలించి, విండో నుంచి బయట కనిపిస్తున్న వైజాగ్ బీచ్‌ను చూశాడు.
అతని చూపులో ఒక రకమైన వింత గర్వం ఉంది.
దిలీప్ అని గంభీరంగా పిలిచాడు.దిలీప్ తక్షణమే లోపలికి వచ్చాడు. చెప్పండి సర్.
మేనేజర్‌కి చెప్పు ఇక్కడ సేల్స్ నాకు నచ్చలేదు. ఈ మాల్ కేవలం షాపింగ్ కోసం కాదు,క్వాలిటీ తగ్గినా, నా రూల్స్ పాటించకపోయినా ఈ మాల్ రేపటికి మూతపడాలి.
ఆ విషయం వాడికి క్లియర్ గా చెప్పు అన్నాడు ఇషాంత్ కళ్ళలో నిప్పులు కురిపిస్తూ.దిలీప్ నోట్స్ రాసుకుంటూ, సర్.మీటింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు హోటల్ కి వెళ్దామా అని అడిగాడు.
ఇషాంత్ ఒక్కసారిగా తిరిగి, హోటలా నేను ఎక్కడో ఉండటం ఏంటి,వైజాగ్‌లో నాకు సొంతంగా విల్లా ఉంది కదా! దిలీప్..
మనం ఇక్కడ ఒక రోజు ఉండటానికి రాలేదు. వైజాగ్‌లో భూపతి ఇండస్ట్రీస్ కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అవ్వాలి. కనీసం ఒక నాలుగు రోజులు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది.
ఆ పనులన్నీ చక్కబెట్టుకుని వెళ్దాం. నువ్వు వెళ్లి వెంటనే ఏర్పాట్లు చూడు. మన విల్లాని మొత్తం క్లీన్ చేయించు. నా పర్సనల్ స్టాఫ్ తప్ప బయటవాళ్ళు ఎవరూ అక్కడ ఉండకూడదు.
ఈ రాత్రికి నేను అక్కడే స్టే చేస్తాను అని ఆర్డర్ వేశాడు.
దిలీప్ వెంటనే ఫోన్ తీసి విల్లా క్లీనింగ్ మరియు సెక్యూరిటీ ఏర్పాట్లు చేయమని ఆదేశాలు ఇచ్చాడు.
ఇషాంత్ కి చిన్న ధూళి కణం ఉన్నా నచ్చదు, అందుకే దిలీప్ స్వయంగా పర్యవేక్షించాల్సి వచ్చింది.గంట తర్వాత ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
సర్ కారు రెడీగా ఉంది. విల్లాకి వెళ్దాం.అన్నాడు దిలీప్.
ఇషాంత్ తన ఫైల్స్ క్లోజ్ చేసి, గర్వంగా నడుచుకుంటూ మాల్ మెయిన్ ఎగ్జిట్ వైపు వస్తున్నాడు. చుట్టూ బాడీగార్డ్స్ రక్షణగా ఉన్నారు.
సరిగ్గా అదే సమయంలో మాల్ మెయిన్ గేటు దగ్గర ఒక 3 స్కూటీ వచ్చి ఆగయు .దాని మీద నుంచి మైరా తన నలుగురు ఫ్రెండ్స్ (కీర్తి, స్నేహ, శ్రీధర్, వంశీ) తో కలిసి కిలకిల నవ్వుకుంటూ దిగింది.
అబ్బా ఈ మాల్ లో ఏసీ అంటే ఏసీ రా బయట ఎండ తట్టుకోలేకపోతున్నాం అంది మైరా తన జుట్టు సవరించుకుంటూ.
వంశీ నవ్వుతూ, అవును మైరా కానీ ఇక్కడ రేట్లు చూస్తే నీకు చెమటలు పడతాయి జాగ్రత్త.అని ఆటపట్టించాడు.
చూద్దాం రా రేట్లు ఎక్కువైతే కొనం,
కానీ చూడటానికి మన సొమ్మేం పోయింది అని ధైర్యంగా అడుగు వేసింది మైరా.ఇక్కడ ఇషాంత్ తన రాజసంతో బయటకి వస్తున్నాడు..
ఇక్కడ ఇషాంత్ తన రాజసంతో, చుట్టూ సెక్యూరిటీ వలయంతో బయటకు వస్తున్నాడు. అడుగు తీసి అడుగు వేస్తుంటే నేల కూడా వణుకుతున్నట్లుగా అతని నడకలో ఒక గర్వం కనిపిస్తోంది.
సరిగ్గా అదే సమయంలో మైరా తన ఫ్రెండ్స్‌తో కలిసి అల్లరిగా, వెనక్కి తిరిగి నవ్వుకుంటూ లోపలికి పరుగెత్తుకొస్తోంది.
అరేయ్ వంశీ నువ్వు ఆగు ఈరోజు షాపింగ్ అంతా నా ఇష్టమే అని గట్టిగా అరుస్తూ, వెనక్కి తిరిగి చూస్తూ వేగంగా లోపలికి దూసుకొచ్చింది మైరా.
ముందు ఎవరున్నారో ఆమె గమనించలేదు. ఇటు ఇషాంత్ తన ఫోన్లో ఏదో మెయిల్ చూసుకుంటూ తల వంచుకుని వస్తున్నాడు.
సెక్యూరిటీ వారు పక్కకు తప్పుకోమనే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.మైరా వేగంగా వచ్చి ఇషాంత్ గుండెలకి బలంగా తగిలింది.
ఆ తాకిడికి ఇషాంత్ చేతిలో ఉన్న ఖరీదైన ఫోన్ ఎగిరి దూరంగా పడింది. ఇషాంత్ ఒక్కసారిగా వెనక్కి తూలాడు.
అతని కళ్ళలో ఒక్కక్షణంలోనే కరకుతనం పెరిగింది.మైరా కూడా ఆ షాక్‌తో కింద పడబోయి, ఇషాంత్ షర్ట్ కాలర్‌ని గట్టిగా పట్టుకుంది.
ఆ పట్టులో ఇషాంత్ వేసుకున్న లక్షల విలువైన బ్రాండెడ్ సూట్ నలిగిపోయింది. చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్, దిలీప్ అందరూ నిర్ఘాంతపోయారు.
కొనసాగుతుంది…….
ఇప్పుడు మన మైరా పరిస్థితి ఏంటి, ఇశాంత్ ఎలా రియాక్ట్ అవుతాడు నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం..
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్
Swipe left/right or tap the sides to turn pages