ఆ అమ్మాయి ఏంచేస్తోంది? రిపోర్ట్స్ వచ్చాయా అని అడిగాడు ఇషాంత్…….
హైదరాబాద్‌లోని ఆకాశాన్ని తాకే భూపతి ఇండస్ట్రీస్ భవనంలో, ఇషాంత్ తన కుర్చీలో వెనక్కి వాలి ఆలోచిస్తున్నాడు.
ఒక విషయం చెప్పాలి.. ఇషాంత్ వైజాగ్ నుంచి అంత సులభంగా వచ్చేయలేదు.
అతను విల్లా నుంచి ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందే మైరా గురించి ఆలోచిస్తూనే వచ్చాడు..
అసలు ఏం జరిగిందంటే.. ఇషాంత్ వైజాగ్ విల్లాలో ఉన్నప్పుడు, తన పర్సనల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అత్యంత నమ్మకస్థుడైన విక్రమ్ అనే ప్రైవేట్ డిటెక్టివ్‌ని పిలిపించాడు.
విక్రమ్ ఆ అమ్మాయి.. ఆ మైరా. ఆమె ఊపిరి పీల్చినా ఆ శబ్దం నాకు వినిపించాలి. ఆమె ఏ నిమిషానికి ఎక్కడ ఉంటుంది?