New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 5

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 5

తల్లి చిరునవ్వు నీ చూడగానే మార్నింగ్ నుంచి ఉన్న వర్క్ స్ట్రెస్ అంత పోయింది దేవాన్ష్ కి.

 

“ఏంటి దేవ వచ్చిన రోజు నుంచి వర్క్ వర్క్ అంటూ తిరుగుతూనే ఉన్నావు ..బిజినెస్ ఎపుడు ఉండేది కదా ..నేను నిన్ను చాలా మిస్ అవుతాను కన్నా”అన్నారు మహాలక్ష్మీ గారు.

 

“హ్మ్మ్ మార్నింగ్ నుండి నేను పక్కనే ఉన్న నన్ను పట్టించుకోలేదు..వాడు రాగానే నా కన్న అని మొదలు పెట్టేశావా” అందుకున్నారు ధనుంజయ్ వర్మ గారు..

 

“అసలు మిమ్మల్ని అనాలి ..చదువు కాగానే బిజినెస్ అని వాడిని బిజినెస్ లోకి లాగారు మీకు లానే వాడిని కూడా ఒక మెషీన్ చేసేసారు..అక్కడ బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ అని మొత్తం వాడిమీద వదిలేసి మీరు రెస్ట్ అంటూ  మంచిగా ట్రిప్ వేస్తుంటారు” అని మూతి తిప్పారు లక్ష్మీ గారు..

ధనుంజయి గారు షాక్ అయి 

“అవును అవును నేనే ఎంజాయ్ చేస్తున్న,ట్రిప్ కాదు నేను వర్క్ మీదే వెళ్తున్నా,నువ్వే గుర్తించట్లేదు నా కష్టం ని”

 

తల్లి తండ్రి ఫైటింగ్ చూసి చిరు నవ్వు అతని పెదవుల మీద. వారే తన సంతోషం, బలం..

 

చిన్నప్పుడు నుంచి అతని చదువు ,స్పోర్ట్స్ ఇవే అతని ప్రపంచం. చదువు లోను స్పోర్ట్స్ లో ముందే ఉండేవాడు.లెక్క పెట్టలేని ట్రోఫీ లు మెడల్స్ ఉన్నాయి..

 

హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాడు.రాగానే CEO స్థానం లో చేరి కంపెనీ బాధ్యత తీసుకునీ కంపెనీ షేర్స్ అండ్ ఎకానమీ ను పెంచేశాడు తన టాలెంట్ తో..

యూ స్ లో కూడా బ్రాంచ్ పెట్టీ అక్కడ కూడా వర్మ’ స్ మార్క్ నిలిపాడు..

 

యంగెస్ట్ బిలియనీర్ ,

 

యూత్ ఐకాన్ గా నిలిచాడు.. 

ఒక ఇండస్టీ తో మొదలు ఇపుడు ప్రతి రంగం లో వర్మ ‘s పాదం ఉంది.

ఇందులో అతని పాత్ర ఉంది.

 

కొడుకు ఎంత ఎదిగిన తల్లి కి ఎప్పుడూ చిన్న కొంగు పట్టుకొని తిరిగిన పసివాడే గుర్తొస్తాడు.. లక్ష్మి గారికి దేవాన్ష్ కి ఇష్టం అయినవి వండి తన చేతి తో గోరుముద్దలు పెడుతూ చూసుకోవాలి అని.

 

ఉన్న ఒక్క కొడుకు కూడా భర్త లాగానే బిజినెస్ అంటూ రోజు ఆఫీసు లోని కూర్చుంటే తల్లి మనసు తల్లడిలుతుంది..

కొడుకు ఎలా ఉన్నాడో తింటున్నాడు లేదో అనే ఆందోళన సగటు తల్లి గా ఉండనే ఉంటుంది..

 

అతనికి మాత్రం తెలీదా తల్లి ప్రేమ కానీ బిజినెస్ కూడా ముఖ్యమే కదా. తల్లిని బాధ పెట్టకుండా ఆవిడ తో దొరికిన టైం స్పెండ్ చేస్తూనే ఉంటాడు. 

 

లక్ష్మీ గారు ఒంటరిగా ఫీల్ అవ్వదు  అని తండ్రికి ఆఫీస్ వర్క్ నుంచి కొంత విరమణ ఇచ్చి తండ్రి తల్లి దగ్గర ఉండేలా చూస్తున్నాడు..

 

తండ్రి వర్క్ కూడా తన మీద వేసుకోవడం తో ఎక్కువ సమయం ఆఫీస్ మీటింగ్స్ లోనే అయిపోతుంది అది తల్లికి చెప్పి నొప్పించలేక ,, ఏదో ఒక సమాధానం తో. కూల్ చేసేస్తాడు మన బాబు    

 

 నీలాల కళ్ళతో ప్రేమ గా చూస్తే చాలు ఇట్టే కరిగిపోతారు ఎవరైనా..

ఈసారి తల్లికి అదే టాలెంట్ వాడేశాడు.

 

“మామ్, వర్క్ ని నెగ్లెక్ట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్..మన కంపెనీ లో ఎంతో మంది కష్టం ఉంది.మన ఎర్నింగ్ చాలా మందికి ఫుడ్ పెడుతుంది. నీకోసం

వీకెండ్ లో మీతోనే ఉంటాను” అన్నాడు..

 

“సరే కన్నా,నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు అనే నా బాధ., ఫ్రెష్ అయ్యి రా కలిసి డిన్నర్ చేద్దాం” అన్నారు లక్ష్మీ గారు.

సరే అని దేవాన్ష్ తాన రూమ్ లోకి వెళ్ళాడు.

 

“మీరు వెళ్ళండి.. అందరు కలిసి డిన్నర్ చేద్దాము.”

 

“నీ కన్నా ఉన్నాడుగా ఇంకా నాతో ఏంటి” అన్నారు ధనుంజయ్ గారు

“చాలు లెండి పిల్లాడి తో మీకేంటి” 

 

“అంతే లేవోయ్ కొడుకు రాగానే మొగుడు కళ్ళకి కనిపించట్లేదు.” 

 

“నాకేం సైట్ లేదు అండి మీరు బానే కనిపిస్తున్నారు” అని అన్నారు లక్ష్మీ గారు..

 

“బానే చమత్కారం ఉంది నీలో తరువాత చెప్తాను” అని రూమ్ లోకి వెళ్ళిపోయారు ధనుంజయ్ గారు.

దేవాన్ష్ కి ఇష్టమైన వంటకాలతో డైనింగ్ టేబుల్ నిండి పోయింది.. ఇంటి విషయాలు ఆఫీస్ ముచ్చట్లు చెప్పుకుంటూ

ముగ్గురు కలిసి బోజనాలు చేశారు.

 

“గుడ్ నైట్ డాడ్ గుడ్ నైట్ మామ్ “

 

“గుడ్ నైట్ దేవా”

 

కొన్ని ఆఫీస్ కాల్స్ ఉంటే మాట్లాడి, మెయిల్స్ చెక్ చేసి  నిద్రపోయాడు.

 

 

నెక్స్ట్ డే 6 కి జిమ్ చేసి తల్లి పంపిన ప్రోటీన్ షేక్ అందుకొని తాగుతూ, నాప్కిన్ తో చమట అంతా తుడుచుకుంటూ బాల్కనీ నుండి సూర్యోదయము చూస్తూ.. షేక్ ఫినిష్ అయినాక ఫ్రెష్ అయి కిందకి వెళ్ళి తల్లి పెట్టిన టిఫిన్ చేసి బాయ్ చెప్పి ఆఫీస్కి  వెళిపోయాడు..

ఇదే అతని రొటీన్ ఉదయం 5కి లేచి జిమ్ ఫినిష్ చేసి,ఆఫీస్ , మీటింగ్స్ ఇల్లు.. ప్రతిది టైం టు టైం మెయింటైన్ చేస్తాడు..ఫుడ్ కూడా డైట్ ఫుడ్ అండ్ హోమ్ ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాడు.

…..,………………..

 

✨✨✨✨✨✨✨