New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 34

మై మాఫియా డాన్ – 34

తెల్లవారుజామున ఆకాశం ఇంకా పారవశ్యంలో మునిగి ఉండగానే, సామ్రాట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆ భారీ కల్యాణ మండపం వేల సంఖ్యలో విద్యుత్ దీపాల వెలుగులో ధగధగలాడిపోతోంది. 

 

మంగళ వాయిద్యాల మోతతో ఆ ప్రాంతమంతా ఒక కొత్త లోకాన్ని తలపిస్తోంది. రణ్వీర్ సామ్రాట్ తన గదిలో సిద్ధమవుతున్నాడు. 

 

అతని కళ్లలో ఎప్పుడూ ఉండే ఆ కోపం ఈరోజు ఒక గంభీరమైన నిశ్శబ్దానికి చోటిచ్చింది. 

 

పసుపు రంగు పట్టు పంచె, తెల్లటి పట్టు చొక్కా ధరించి, భుజంపై బంగారు అంచు ఉన్న శాలువాను వేసుకున్న రణ్వీర్ నిజంగానే ఒక సామ్రాజ్యానికి అధిపతిలా కనిపిస్తున్నాడు. 

 

అతని పక్కనే ఉన్న రఘు, రణ్వీర్ ని చూసి చిన్నగా నవ్వుతూ, రానా ఈరోజు నీ జీవితంలోనే అతిపెద్ద బాధ్యతను అంటె పెళ్ళి చేసుకుంటున్నావు..

 

ఈ బంధం నీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని భుజం తట్టాడు. రణ్వీర్ కేవలం తల ఊపి, తన చేతికి ఉన్న రోలెక్స్ వాచ్ ని సరిచేసుకుంటూ మండపం వైపు అడుగులు వేశాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue