పూజ ముగిసిన తర్వాత బంగ్లా అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది కానీ, రణ్వీర్ మనసులో మాత్రం యుద్ధం నడుస్తోంది.
దేవి గారు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకోవడానికి రణ్వీర్ తన గదిలోకి వెళ్తుండగా, రఘు వైపు ఒక తీక్షణమైన చూపు చూశాడు.
ఆ చూపులోని అర్థం గ్రహించిన రఘు, వెంటనే రణ్వీర్ వెనుక గదిలోకి వెళ్ళాడు. గది తలుపులు మూసుకున్న మరుక్షణమే రణ్వీర్ గంభీరంగా మారిపోయాడు.
ఖాల్సా మరియు జగ్గర్ చేస్తున్న ప్లానింగ్స్ గురించి రఘు ఏదైనా కొత్త సమాచారం చెబుతాడేమో అని రణ్వీర్ ఎదురుచూస్తుండగా,
రఘు తన చేతిలోని టాబ్లెట్ చూపిస్తూ ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. రణ్వీర్ ఇప్పుడే ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది.
మన ఇంటర్నేషనల్ క్లయింట్స్ స్టేట్స్ (USA) లో రేపు ఉదయం ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ డీల్ మన కి చాలా ముఖ్యం.