ముందు రోజు రాత్రి జరిగిన గొడవ కారణంగా ఆ రూంలో పగిలిపోయిన ఉన్న ఫ్లవర్ వాస్ సీసాలు అవి నీట్ గా క్లీన్ చేసి రూం అంతా సర్దుతూ ఉండగా అంతలో ఎవరో వచ్చి వాళ్ళు ఉన్న రూం డోర్ కొట్టారు….అభి కొంచం భయంగా , బెరుకుగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది…..
అభి డోర్ ఓపెన్ చేయగానే రాత్రి జరిగిన విషయం చెప్పి జానకమ్మ గారు వాళ్ళు ఈ రోజు సాయంత్రం కి ఇంటికి వస్తారు అంట…..మీకు కావలసినవి అన్నీ కనుక్కొని చేసి పెట్టమని చెప్పారు….ఇడ్లీ , దోశ , వడ చేశాము….మీరు ఏం తింటారో చెప్తే అది కూడా చేస్తాను…అని చెప్పింది….
చాముండి గారికి హార్ట్ స్ట్రోక్ అని తెలిసి బాధపడుతూ యాంగ్రీ బర్డ్ కి వాళ్ళ నానమ్మ గారు అంటే చాల ఇష్టం…ఆవిడకి ఇలా జరిగింది అని తెలిస్తే పాపం చాల బాధపడతాడు…
ఇప్పటికే నా వల్ల ఎప్పుడు తాగని మందు కూడా తాగి రాత్రి అంత వాంతులు అవి చేసుక్కునాడు…ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏం అయిపోతాడో అని అనుకుంటూ అప్పుడే వాళ్ళ అక్క గుర్తు రావడంతో అక్కడే ఉన్న పని మనిషిని చూస్తూ ” మా అక్క ఏం చేస్తుంది…? తను ఎలా ఉంది…? అని అడిగింది..
ఆ మేడం గారు నిన్న సాయంత్రం అనగా తలుపు వేసుకొని ఇప్పటికి కూడా తలుపులు తియ్యలేదు…
జానకమ్మ గారు , రఘు బాబు గారు వాళ్ళు ఎంత బతిమాలినా కూడా వినలేదు…వాళ్ళందరూ తన దగ్గరికి వెళ్ళాలి అని చూస్తే చచ్చిపోతా అని బెదిరించారు..అని చెప్పింది…
అభి కి కిందకి వెళ్లి వాళ్ళ అక్క నీ చూడాలి అని ఉన్న కూడా తనని చూస్తే ఇంకా ఎక్కువ కొప్పడి నిజంగా ఏదైనా పిచ్చి పని చేసుకుంటుందో ఏమో అని భయంతో వెళ్లకుండా ఆ పని మనిషి తోనే వాళ్ళ అక్క ఎలా ఉందో కనుక్కమని చెప్పి తనకి ఆకలిగా లేదు అని చెప్పి ఆ పని మనిషిని పంపించేసింది….
పని మనిషి వెళ్ళిపోయాక బెడ్ మిద ఉన్న విక్కీ నీ ఒకసారి చూసి నిన్న తనతో పాటు తెచ్చుకున్న తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న తన ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తూ బాల్కనీ లోకి వెళ్ళిపోయింది….