New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 24

మౌనమే ని భాష – 24

ఆ రాత్రి వంశీకి ఒక రకమైన ప్రశాంతత దొరికింది. శ్రావణి మెడలో ఆ దుర్మార్గుడి తాళి పడలేదని, పోలీసులు సరైన సమయానికి వచ్చి ఆమెను కాపాడారని తెలుసుకున్నాక, అతని మనసు తేలికపడింది.

 

ఆ ఆనందంలోనే తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు గదిలోకి వస్తున్నా, వంశీకి ఇంకా ఆ డైరీ చదవాలనే ఆత్రుత ఉంది. 

 

కానీ ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఉండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పుస్తకాన్ని బ్యాగ్ లో  పెట్టి ఆఫీసుకి బయలుదేరాడు. కానీ అతని మనసంతా ఆ డైరీలోని తర్వాతి పేజీల మీదనే ఉంది.

 

మరోవైపు శ్రావణి పరిస్థితి నరకప్రాయంగా ఉంది. మార్కెట్‌లో ఆ వ్యక్తిని చూసినప్పటి నుండి ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది.

 

రాత్రంతా తలుపు దగ్గరే కూర్చుని ఏడుస్తూ గడిపింది. వాడు నన్ను చూశాడు.. మళ్ళీ వాళ్ళ  దగ్గరకు నన్ను తీసుకెళ్తారా? నన్ను బతకనివ్వరా? అన్న భయం ఆమెను వణికిస్తోంది. 

 

తెల్లవారుజామున 5 గంటలకి మెలకువ వచ్చినా, మంచం మీద నుండి లేవడానికి కూడా భయపడింది.

మెల్లగా లేచి తన నిత్యకృత్యాలను పూర్తి చేసుకుంది కానీ ఆఫీసుకి వెళ్లాలంటే కాళ్లు వణుకుతున్నాయి.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue