రాక్షసప్రేమ -21
“ఎలా వెళ్లాలో దారి నాకు తెలుసులే, నువ్వు నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోతాను” అని ఆమె కింద పెదవి పట్టుకొని లాగుతూ అన్నాడు రౌద్ర.
“ఏంటి ఇప్పుడా..? ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు వద్దు, నువ్వు మ్యాచ్ గెలిచి కప్పు తీసుకొని వస్తావు కదా, అప్పుడు అప్పుడు కచ్చితంగా ఇస్తాను ప్లీజ్ ఇప్పుడు వద్దు” అని అతని గడ్డం పట్టుకుని మరి రిక్వెస్ట్ చేసింది శౌర్య..
“అవునా..? ఇప్పుడు ఇవ్వవా? సరే అయితే కింద నీ బాబు ఎవరితోనో మాట్లాడుతున్నాడు కదా వాళ్ళ అందరి ముందుకి నేను ఇలానే డైరెక్ట్ గా వెళ్ళిపోతాను, అప్పుడు కూడా ఇవ్వను అంటావా..?” అని అతను ఆమెను వదిలిపెట్టి డోర్ దగ్గరకి వచ్చాడు..
“అయ్యో వద్దు వద్దు”అని భయంగా అంటూ అతను నిజంగానే ఎక్కడా బయటకు వెళ్ళిపోతాడేమోనని చేతిని పట్టుకుని వెనక్కి లాగి ప్లీజ్ అని క్యూట్ గా ఫేస్ పెట్టి రిక్వెస్ట్ చేసింది శౌర్య.