రాక్షస ప్రేమ -23
అతడు తన బుగ్గ మీద ముద్దు పెడితే, అలా బుగ్గ మీద చేతిని పెట్టుకుని వెళ్తున్న రౌద్ర వైపు చూస్తూ ఉంది శౌర్య.
పెళ్లి ఫిక్స్ అయిపోయినందుకు కనకధారకు మాత్రం అస్సలు నచ్చలేదు ఏదో ఒక రకంగా పెళ్లి చెడిపోతుంది అని అనుకుంది కానీ తన అత్తయ్య ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఇంకా ఆశ్చర్యంగానే ఉంది.
ఇప్పుడే ఏముంది పెళ్లిలో ఏదైనా లోటుపాట్లు జరిగితే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పింది కదా, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యే విధంగా చేస్తే సరిపోతుంది కదా..! నాకు ఈ అమ్మాయి నచ్చలేదు ఈ పెళ్లి సంబంధం నచ్చలేదు అని మనసులోనే అనుకుంది కనకధారా…
విరాట్ విరాజిత చేతిని పట్టుకుని “ఎక్కువగా ఆలోచించొద్దు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను” అని భరోసాగా చెప్పి కార్ ఎక్కాడు.
అలా అందరూ కార్ ఎక్కారు కనకమహాలక్ష్మి కారు ఎక్కుతూ “ఎల్లుండి గురువారం మంచి రోజు ఆరోజు పసుపు దంచి పెళ్లి పనులు మొదలు పెట్టండి అంతా మంచే జరుగుతుంది” అని చెప్పింది.