కంటిన్యూ గా విష్ణు నుండి కాల్ వస్తుంటే కార్ ఒక పక్కగా ఆపి.. కాల్ ఏక్సెప్ట్ చేసాడు వీర్.
హలో సర్.. అన్నాడు కంగారుగా విష్ణు.
విష్ణు.. చెప్పు.. ఇంకా అవమానం చేయాల్సింది ఏమైనా ఉందా?? అన్నాడు వీర్ స్టైల్ గా.
సర్.. ప్లీజ్.. ఎక్కడున్నారు.. నేను మీతో మాట్లాడాలి.. అన్నాడు విష్ణు.
హ్మ్.. సరే.. మీ ఏరియా లో చివరిగా ఉన్న రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తుంటా.. రా.. అని ఫోన్ పెట్టేసాడు వీర్.
* * * * * * * * *