నువ్వు లోపలికి పో! నేను కోసుకుంటాను!” మందారాన్ని చేతిలోకి తీసుకుంది ఆవిడ…
“అయ్యయ్యో! నాన్నమ్మ!” గట్టిగా అరిచింది…
ఆ అరుపుకి జడుసుకుని గుండెల మీద చిన్నగా తట్టుకుంది భానుమతి…
£££
“ఏమే!? ఎందుకే అరిచావ్? నా ముసలి ప్రాణాన్ని ఉండనివ్వవా?” నీరసం గా అంది…
“అది కాదు నానమ్మ! నువ్వు పువ్వులను కోసేస్తావేమోనని?? భయంతో అరిచాను. సారీ!” చెప్పింది..
ఇది రోజు జరిగే తంతే.. అందుకే ఆవిడ పెరట్లో ఉన్న పువ్వులన్నీ వదిలేసి బయట కొంటుంది…