రాఖి జాను నీ హాస్పటల్ లో జాయిన్ చేసి , తన గురించి డిటైల్స్ కనుక్కమని అతని పి. ఏ కి చెప్పి కార్ లో మీటింగ్ జరిగే హోటల్ కి వెళ్తాడు.
అలా ఒక అరగంట తర్వాత హోటల్ లో ప్రైవేట్ రూం లో మీటింగ్ హాల్ లో ఉంటారు రాఖి , విక్రమ్ , విజయ్.
ఫారిన్ నుంచి వచ్చిన క్లయింట్స్ వాళ్ళ రిక్వైర్ మెంట్స్ , కండిషన్స్ అన్నీ చెప్పి దానికి ఓకే అంటే వాళ్ళ అగ్రిమెంట్ సైన్ చేసుకుందాం అని అంటారు.
రాఖి ఒకరికి కండిషన్స్ పెట్టడమే తెలుసు కానీ…వేరే వాళ్ళ కండిషన్స్ కి అతను తగ్గి ఒకే చెప్పడం అతని హిస్టరీలోనే లేదు.