New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై రాక్షస బాబు – 5

మై రాక్షస బాబు – 5

 

ధృవ్ కి డాష్ ఇచ్చి కింద పడిన అమ్మాయి నీ చూసి కోపంగా తనని వాళ్ళ ఫ్యాక్టరీ లో డైలీ లేబర్ లా వర్క్ చేయించు అని మున్నా కి చెప్పి హోటల్ నుంచి హాస్పటల్ కి స్టార్ట్ అవుతాడు దృవ్…

ధృవ్ ఆ అమ్మాయి కి ఇచ్చిన పనిష్మెంట్ గురించి ఫోన్ లో విన్న మూర్తి గారు ధన్విక గురించి జాలి పడుతూ డాక్టర్ నీ కలిసి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడడానికి వెళ్ళిపోతారు…

 

హోటల్ లో దృవ్ గురించి ఫారినర్స్ కి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన మీడియేటర్ ఉన్నారు కదా…. ఆయన దృవ్ వెళ్లిపోయిన తర్వాత అక్కడ నుంచి వాష్ రూం లోకి వెళ్లి ఎవరికో కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు…

 

దక్షయ్ బాబు డీల్ చేస్తున్న ఫారినర్స్ న్యూ ప్రాజెక్టు మీటింగ్ లో సడెన్గా దృవ్ బాబు ఎంటర్ అయ్యారు..

 

ధృవ్ బాబు గురించి తెలియగానే ఆ ఫారినర్స్ ఇంకా DV ( ధక్షయ్ వర్మ) గ్రూప్ కి కాకుండా DK ( దృవ్ కేశవ్ వర్మ) గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తో టై అప్ అయ్యి వాళ్ళతో ప్రాజెక్టు సైన్ చెయ్యడానికి ఫిక్స్ అయ్యారు..

రేపు DK కంపనీ లో లీగల్ గా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుంటారు అంట..అని అక్కడ జరిగిన విషయం అంతా పిన్ టూ పిన్ మొత్తం ఎవరికో కాల్ లో చెప్తూ ఉన్నాడు…

కాల్ లో  ఉన్న అవతల వ్యక్తి మొత్తం విన్న తర్వాత అతని పెదాల మిద ఒక చిన్న నవ్వు అలా వచ్చి ఇలా మాయం అయిపోయింది..

 

అతను గొంతు సవరించుకొని గంభీరంగా మాట్లాడుతూ ఒకే నువ్వు ధక్షయ్ నీ తీసుకొని మన ఆఫీసు కి వచ్చేయ్… ఆ విషయం ఇంకా అక్కడితో వదిలేయ్ అని చెప్పి కాల్ కట్ చేసి….

నీ తమ్ముడు మిద నే నీ పంతం , నీ ప్రతాపం చూపిస్తున్నవా దృవ్….!!! అని అనుకొని బాధగా ఒక నిట్టూర్పు విడిచి అతను ఉన్న రూం నుంచి బయటకి వచ్చి ఆ పక్కనే ఉన్న వేరే రూం లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటారు ఆయన..

 

 

ఆ మీడియేటర్ కాల్ కట్ అయ్యాక వాష్ రూం లో నుంచి వెళ్లి ధక్షయ్ నీ తీసుకొని వాళ్ళ  DV గ్రూప్ ఆఫీసు కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాడు…

 

………………….

హాస్పటల్ లో….

తాతయ్య ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడిగాడు దృవ్…

 

బెడ్ మిద ఉన్న దృవ్ తాత గారు ( కేశవ్ రావ్ వర్మ ) మాట్లాడుతూ నాకు బాగానే ఉంది కానీ నీ సంగతి చెప్పు…

 

పెళ్లి అయ్యింది కానీ ఇప్పటి వరకు నా మనవరాలి ( దన్విక) నీ తీసుకొని ఇంకా మన ప్యాలెస్ కి వెళ్ళలేదు అంట….ఎంటి సంగతి..??? 

 

 

అసలు నా మనవరాలు ఎక్కడ ఉంది…??? తనని ఏం చేసావు…??? అని గంభీరంగా కొంచం కోపం గా అడుగుతారు…

 

ఆ మాటకి దృవ్ అసహనంగా ఆయన్ని చూస్తూ ముందు మీ ఆరోగ్యం గురించి అలోచించి , జాగర్తగా ఉండండి…అనవసరం అయిన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడడం అవసరమా అని అంటాడు చిరాకుగా..

 

రేయ్ దృవ్….! ఇప్పుడు తను నీ కంపెనీ లో పని చేసే మామూలు మధ్య తరగతి అమ్మాయి కాదు….DK గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీ.ఈ.ఓ, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్  దృవ్ కేశవ్ వర్మ భార్య…

 

ఈ కేశవ్ వర్మ కి మనవరాలు…


తన గురించి ఆలోచించాల్సిన అవసరం , భాధ్యత అన్నీ నా మిద ఉన్నాయి..

 

మర్యాదగా నా మనవరాలిని తీసుకొని రేపు సాయంత్రం లోపు నువ్వు మన ప్యాలెస్ లో ఉండాలి లేదు అంటే నేను ఏం చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నా…అని చెప్పి

 

 

మూర్తి… !!  రేపు కొత్త కోడలు , ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ దృవ్ కేశవ్ వర్మ భార్య తన ఇంటికి వస్తుంది…ఏర్పాట్లు అన్నీ ఘనంగా ఉండాలి..

 

 

ఎక్కడ ఎలాంటి లోటు ఉండకూడదు..అలాగే ఈ సండే రోజు రిసెప్షన్ కి కూడా ఏర్పాటు చెయ్…

 

నా మనవరాలిని ( ధన్విక ) ఈ ప్రపంచం అంత తెలిసేలా వర్మ ఇంటి కోడలిగా , దృవ్ కేశవ్ భార్య గా అందరికీ పరిచయం చెయ్యాలి..

 

దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ నువ్వే దగ్గర ఉండి చూస్కో…..అలాగే అందరికీ ఒక రోజు ముందుగానే ఇన్విటేషన్ పంపించు…ఏర్పాట్లు మాత్రం ఎక్కడ తగ్గకూడదు..జాగ్రత్త అని చెప్పి దృవ్ నీ చూస్తూ…

 

ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావు ఎంటి..??? వెళ్ళు వెళ్లి నా మనవరాలి నీ తీసుకొని రేపు సాయంత్రం కి ప్యాలెస్ కి వచ్చేయ్…అలాగే సండే రోజు నీకు ఏం అయిన ప్రోగ్రామ్స్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకొని రిసెప్షన్ కి రెడీ గా ఉండు…

ఆ రోజే ప్రెస్ మీట్ కూడా ఉంటుంది…రెడీ గా ఉండు అని చెప్పారు..

ధృవ్ కోపంగా పిడికిలి బిగించి దాన్ని కేశవ్ వర్మ ఇంటి కోడలిగా నేను పరిచయం చెయ్యను…

 

 

అసలు అలాంటి ఆడదానికి వర్మ ఇంటి కోడలు అయ్యే అర్హత లేదు..ఇంకా చెప్పాలి అంటే అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు…

 

మీ కోసం , కేవలం మీ కోసం , మీరు బలవంతం చెయ్యడం వల్ల ఇష్టం లేకపోయినా కూడా దాన్ని పెళ్లి చేసుకున్నాను…కానీ ఇప్పుడు దాన్ని నా భార్య గా , వర్మ ఇంటి కోడలిగా ప్రపంచానికి పరిచయం చెయ్యమంటే నేను అసలు దీనికి ఒప్పుకోను..

 

అది ఎప్పటికీ నాకు భార్య కాలేదు….వర్మ ఇంటికి కోడలు అసలు అవ్వలేదు…అని ఖరాఖండిగా చెప్తాడు దృవ్…

 

ఆ మాటలకి కేశవ్ రావ్ వర్మ గారు కూడా గంభీరంగా ” ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ అమ్మాయి వర్మ ఇంటి పెద్ద కోడలు… దృవ్ కేశవ్ వర్మ భార్య….

 

ఎవరు ఒప్పుకున్న  , ఒప్పుకోకపోయినా ఇది నిజం..నేను సండే రోజు జరిగే రిసెప్షన్ లో అది అనౌన్స్ చేసి తీరుతాను…అలాగే ప్రెస్ కి  , ప్రపంచానికి కూడా ఆ అమ్మాయి నీ  వర్మ ఇంటి కోడలిగా పరిచయం చేస్తాను…

 

ఇంకా ఎవరు ఏం మాట్లాడడానికి వీల్లేదు…ఇదే నా ఆఖరి మాట…అని చెప్పి  నాకు కొంచం తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది నేను రెస్ట్ తీసుకుంటాను…..మీరు అందరు వెళ్ళండి అని చెప్పి పడుకొని కళ్ళు ముసుకుంటారు కేశవ్ రావ్ గారు…

 

దృవ్ కోపంగా అక్కడ ఉన్న గొడకి ఒకసారి గుద్ది….చేతికి రక్తం కారుతూ ఉన్న పట్టించుకోకుండా   , పడుకొని ఉన్న కేశవ్ రావ్ గారి నీ చూసి అక్కడ నుంచి ఫాస్ట్ గా బయటికి వెళ్లి అతనే డ్రైవ్ చేసుకుంటూ గెస్ట్ హౌస్ కి వెళ్తాడు…

 

పది నిమిషాల లో గెస్ట్ హౌస్ ముందు కార్ ఆపి కోపంగా లోపలికి వెళ్లి దన్విక ఉన్న రూ లోకి వెళ్తాడు…

 

 

అప్పటికే టైం సాయంత్రం 5 దాటింది..అప్పుడే సూర్యడు అస్తమిస్తూ ఉంటే ఓపెన్ చేసిన కిటికీ లో నుంచి సూర్య కిరణాలు బెడ్ మిద పడుకొని ఉన్న ధన్విక ఫేస్ మిద పడుతూ , తన ఫేస్ ఎర్రగా మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటే ….

 

 

కేశవ్ రావ్ గారి మాటల వళ్ళ కోపం లో ఉన్న దృవ్ కి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక దాన్ని ధన్విక మిద చూపించాలి అని కోపంగా తన బెడ్ దగ్గరికి వెళ్లి  ఒంటి చేతితో పడుకొని ఉన్న  దన్విక రెక్క పట్టుకొని అలాగే పైకి లేపుతాడు…

 

ఇప్పుడు దృవ్ అతని కోపాన్ని ధన్విక మిద ఎలా చూపిస్తాడు…????

 

నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం…

 

To be continued….