ఫ్లాట్ లోకి వెళ్ళిన రోజీ.. ఒంటిపై ఉన్న ఆ రక్తపు మరకల డ్రెస్‌ని విసిరేసి, హాట్ వాటర్ షవర్ కింద నిలబడింది. ఆ వేడి నీళ్లు తగులుతుంటే బాడీ పెయిన్స్ కొంచెం తగ్గినట్టు అనిపించినా, మైండ్ లో ఏదో అలజడి.
బాత్ ముగించుకుని, ఒక సిల్కీ బ్లాక్ నైట్ సెట్ వేసుకుని కిచెన్ లోకి వెళ్ళింది.. కానీ ఫ్రిజ్ ఓపెన్ చేసి చూస్తే ఎగ్స్, వాటర్ బాటిల్స్ తప్ప ఏమీ లేవు.
”షిట్! ఈ వర్షి కి చెప్పాను ఫ్లాట్ కి వెళ్ళేటప్పుడు గ్రోసెరీస్ తీసుకోవాలి, గుర్తు చేయి అని మర్చిపోయింది చెప్తా దాని పని రేపు!” అని చిరాకుగా గొణుక్కుంటూ, రెండు ఎగ్స్ బ్రేక్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంది.