New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై రాక్షస బాబు – 4

మై రాక్షస బాబు – 4

 

ధృవ్ ప్రేమించిన అమ్మాయి నీ అతను ఏం చేశాడో గుర్తు చేసుకొని భయం , కంగారుతో గతం లోకి వెళ్ళిపోతారు ఆ పెద్దాయన…

 

 

 

ఒక పది నిమిషాలు అలా కళ్లు మూసుకుని గతాన్ని గుర్తు చేసుకొని ఒక్కసారిగా కళ్ళు తెరిచి నో అలా జరగడానికి వీల్లేదు….

 

 

 

 దృవ్ దన్విక అనే అమ్మాయి నీ కూడా అతను ప్రేమించిన ఆ అమ్మాయి లా చెయ్యడానికి వీల్లేదు…వీల్లేదు అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు..

 

…………….

 

 

నీరసం తో కళ్ళు తిరిగి పడిపోయి ఉన్న దన్విక నీ చూస్తూ మెయిడ్ కి పాపం అనిపిస్తుంది కానీ మళ్ళీ తనకి హెల్ప్ చేస్తే ఎక్కడ దృవ్ ఇచ్చే పనిష్మెంట్ కి బలి అవుతుందో అని భయం తో అక్కడ అంతా క్లీన్ చేసి కిందకి వెళ్ళిపోయింది…

 

 

 

ధన్విక దగ్గర నుంచి స్టార్ట్ అయినా దృవ్ నేరుగా   కృష్ణా  తాజ్ హోటల్  ముందు ఆగి అక్కడ అప్పటికే దృవ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఇద్దరు పర్సన్స్ నీ చూస్తూ సీరియస్ గా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు…

 

 

 

అక్కడ ఒక స్పెషల్ రూం లో ఫారినేర్స్ తో నవ్వుతూ మాట్లాడుతూ లంచ్ చేస్తూ వాళ్ళ కంపెనీ గురించి , వాటి బ్రాంచేస్ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు దక్షయ్…

 

 

 

ఆ ఫారినెర్స్ కూడా ధక్షయ్ చెప్పే మాటలు వింటూ తల ఊపుతూ ఫుడ్ తింటూ ఉంటారు…

 

 

 

అలా వుండగానే సడెన్గా వాళ్ళు ఉన్న స్పెషల్ రూం డోర్ ధడేల్ మని ఓపెన్ చేసుకొని స్టైల్ గా లోపలికి వచ్చాడు దృవ్….

 

 

 

ధృవ్ నీ అక్కడ ఎక్స్పెక్ట్ చెయ్యని ధక్షయ్ షాక్ తో అలా చూస్తూ లేచి నిలబడతాడు…

 

 

 

ఇక్కడ ఎప్పుడు అయితే దృవ్ నీ చూడగానే ధక్షయ్ పైకి లేచి నిలబడతాడో అప్పుడు అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో స్టైల్ గా కాలు మిద కాలు వేసుకొని సూట్ సరిచేసుకుంటూ కూర్చుంటాడు దృవ్….

 

 

 

ఆ ఫారినర్స్ కూడా దృవ్ నీ చూసి పైకి లేచి ఆర్ యూ మిస్టర్ దృవ్ కేశవ్ వర్మ….అని అడుగుతారు..

 

 

 

ఏస్ DK గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ మిస్టర్ దృవ్ కేశవ్ వర్మ గారు ఆయనే అని చెప్తాడు అక్కడే ఉన్న ఒక మీడియేటర్…. 

 

 

 

ఆ ఫారినర్స్ దృవ్ దగ్గరికి వెళ్లి అతన్ని విష్ చేసి హలో మిస్టర్ దృవ్ గారు…నైస్ టు మీట్ యూ..మేము నిజానికి మీ గ్రూప్ తో టై అప్ అవ్వాలి అని కోరుకుంటున్నాం కానీ మీ అపైంట్మెంట్ మాకు దొరలేదు…

 

 

 

మీరు మీ పెళ్లి హడావిడిలో బిజీ గా ఉన్నారు అని ఒక టెన్ డేస్ మీరు అవైలబుల్ గా ఉండరు అని తెలిసి ఇంకా మా ప్రాజెక్టు గురించి DV గ్రూప్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము..

 

 

 

మా అదృష్టం మీరే ఇక్కడికి వచ్చారు..ప్లీస్ మా న్యూ ప్రాజెక్టు లో మీరు కూడా మాతో కలిసి టై అప్ అయితే మేము హాపీ ఫీల్ అవుతాము…అని రిక్వెస్ట్ చేసుకుంటు ఉంటారు…

 

 

 

ఆ ఫారినర్స్ అలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే దృవ్ తను పెట్టుకున్న గాగుల్స్ తీసి తన ఎదురుగా కోపంతో నిప్పు కక్కుతున్న కళ్ళతో దృవ్ నే చూస్తూ పిడికిలి బిగించి ఉన్న ధక్షయ్ నీ చూస్తూ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ ఒకే…

 

 

 

రేపు ఆఫీసు కి వచ్చి అగ్రిమెంట్ పేపర్స్ అవి రెడీ చేసి సైన్ చేసుకుందాం….మిగిలిన విషయాలు అన్నీ అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పి సోఫాలో నుంచి పైకి లేచి అతని సూట్ బటన్స్ పెట్టుకుంటు….

 

 

 

నాతో గెలవాలి అని అనుకోవడం నీ పిచ్చి తనం.. ఈ దృవ్ కేశవ్ వర్మ నీ ఛాలెంజ్ చేసి నిలబడే దమ్ము , ధైర్యం ఉన్న వాళ్ళు , నన్ను ఎదిరించి బ్రతికి ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు…! ఇక పై రారు కూడా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..

 

 

 

ఆ ఫారినర్స్ కూడా ధక్షయ్ కి సారీ చెప్పి వాళ్ళు అనుకున్నట్టు DK గ్రూప్ కంపెనీ తో వాళ్ళు టై అప్ అవ్వబోతునందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు…

 

 

 

ఇంకా ఆ రూం లో మిగిలిన ధక్షయ్ కోపంగా అతని ముందు ఉన్న బల్ల నీ గట్టిగా చేతితో గుద్ది ” ఆ… ఆ… ఆ….. రేయ్ దృవ్ నిన్ను వదలను రా….. ప్రతిసారి నేను చేసే పనిలో నాకు అడ్డు వస్తూ నన్ను ఒడిస్తూనే ఉన్నావ్…!!!

 

 

 

నీ దగ్గర నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను…..అప్పటివరకు కష్టపడి సెట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నది అంతా లాస్ట్ మినిట్ లో వచ్చి మొత్తం చెడగొట్టి వాళ్ళని నీ సైడ్ తిప్పుకున్నావు…

 

 

 

చూస్తాను నన్ను కాదు అని ఆ ఫారినర్స్ నీతో కలిసి ఎలా టై అప్ అయ్యి ఈ ప్రాజెక్టు చేస్తారో నేను కూడా చూస్తాను అని కోపంగా పల్లు నూరుతు…

 

 

 అతని పి ఏ ను చూస్తూ ఏదో చెప్పి కన్నింగ్ గా నవ్వుతూ ఈసారి నేను వేసిన గేలం కి నువ్వు చిక్కక తప్పదు అన్నయ్య అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..

 

………….

 

ఆ రూం నుంచి బయటికి వెళ్తున్న దృవ్ కి మూర్తి గారు దగ్గర నుంచి కాల్ వస్తె లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ తాతయ్య ఏం చేస్తున్నారు…??? ఎలా ఉన్నారు…??? అని అడిగాడు…

 

 

 

హా తాత గారు బానే ఉన్నారు దృవ్ బాబు…అది డాక్టర్స్ రేపు సాయంత్రం కి తాత గారిని డిశ్చార్జ్ చేస్తా అని చెప్పారు…తాత గారు నిన్ను ఒకసారి హాస్పటల్ కి రమ్మని చెప్పారు బాబు అని చెప్పాడు…

 

 

 

దృవ్ ఆయన ఎందుకు రమ్మని చెప్పారో ఆలోచిస్తూ సరే ఇంకో పది నిమిషాల్లో వస్తున్న అని చెప్పి మాట్లాడుతూ నడుస్తూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి అనుకోకుండా దృవ్ కి డాష్ ఇచ్చింది…

 

 

 

అది చూసిన దృవ్ పి ఎ మనసు ఇలా అనుకుంటున్నాడు…” పాపం ఎవరో ఈ అభాగ్యురాలు పోయి పోయి మా బాస్ కి డాష్ ఇచ్చి పులి నోట్లో తల పెట్టినట్టు తన చావును తనే కొని తెచ్చుకుంది అని అనుకుంటూ ఆ అమ్మయి నే జాలిగా చూస్తూ ఉంటాడు…

 

 

 

దృవ్ కి డాష్ ఇచ్చిన్ అమ్మాయి బ్యాలెన్స్ చేసుకోలేక కిందపడబోతు సపోర్ట్ గా దృవ్ నీ పట్టుకోబోతు ఉంటే వెంటనే దృవ్ దూరంగా పక్కకి జరుగుతాడు..

 

 

 

ఆ అమ్మాయి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది..కింద పడ్డ ఆ అమ్మాయి విసుగ్గా దృవ్ నీ చూస్తూ హేయ్ కింద పడిపోతూ ఉంటే సపోర్ట్ ఇచ్చి పట్టుకోవాలి అని తెలియదా…

 

 

 

పైగా ఇంత అందం అయిన నేను నిన్ను టచ్ చేస్తూ ఉంటే దూరంగా వెళ్తవా ఆర్ యు మ్యాడ్ అని అరిచింది..

 

 

 

ధృవ్ కోపంగా నిప్పులు కక్కే కళ్ళతో ఆ అమ్మాయి నీ ఒకసారి చూసి మొక్కాళ్ళ వరకు ఉన్న స్లీవ్ లెస్ రెడ్ కలర్ డీప్ నెక్ డ్రెస్ లో ఉన్న ఆ అమ్మాయి నీ చూడగానే ఇంకా కోపం ఎక్కువ అవుతు ఉంటే…

 

 

 

మున్నా….ఆ అమ్మాయి నీ తెలుసుకొని వెళ్లి మన ఫ్యాక్టరీ లో లేబర్ దగ్గర ఒక నెల రోజులు పనిలో పెట్టించి దాని తల పొగరు కొవ్వు అనిగేలా చెయ్..

 

 

అప్పటికి ఇంకా ఇలాగే ఉంటే పర్మినెంట్ గా తనని పని మనిషి నీ చేసెయ్ అని చెప్పి చిరాకు గా అక్కడ నుంచి బయట కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు..

 

 

 

ఇంకా కట్ అవ్వని కాల్ లో అవతల పక్కన లైన్ లైన్ ఉన్న మూర్తి గారు దృవ్ మాటలు , ఆ అమ్మాయి మాటలు విని…..

 

 

అమ్మాయి నీడని కూడా భరించని ఈ దృవ్ బాబు నీ ఆ అమాయకమైన దన్విక అమ్మ ఎలా మర్చగలదు…??? అని అనుకుంటూ కాల్ కట్ చేసి డిశ్చార్జ్ గురించి మాట్లాడడానికి డాక్టర్ నీ కలవడానికి వెళ్ళిపోయాడు..

 

 

 

To be continued…..