New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
విధి విడదీసిన స్నేహం 🥹 – 4

విధి విడదీసిన స్నేహం 🥹 – 4

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పెళ్లి మండపంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

 

“ఈ పెళ్లి ఆపండి!”

 

అని అరిచిన ఆ వ్యక్తి వైపు అందరి చూపులు తిరిగాయి.

 

వల్లీ గుండె గట్టిగా కొట్టుకుంటోంది.

 

రాఘవ ముఖంలో మాత్రం స్పష్టమైన ఆందోళన కనిపించింది.

 

“ఎవరు నువ్వు?”

 

అని రాఘవ తండ్రి కోపంగా అడిగాడు.

 

ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకుని ముందుకు వచ్చాడు.

 

“నా పేరు శ్రీను.”

 

అన్నాడు.

 

“అయితే?”

 

“ఈ పెళ్లి జరగకూడదు.”

 

“ఎందుకు?”

 

“ఎందుకంటే రాఘవ గురించి మీకు పూర్తి నిజం తెలియదు.”

 

మండపంలో ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి.

 

వల్లీ తండ్రి కంగారుగా అడిగాడు.

 

“ఏం నిజం?”

 

శ్రీను కాసేపు రాఘవ వైపు చూశాడు.

 

“రాఘవకి ముందు ఒక ప్రేమ కథ ఉంది.”

 

అన్నాడు.

 

అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

 

కానీ రాఘవ మాత్రం మౌనంగా నిలబడ్డాడు.

 

“ప్రేమ ఉండటం నేరమా?”

 

అని రాఘవ తల్లి కోపంగా అరిచింది.

 

శ్రీను తల ఊపాడు.

 

“ప్రేమ నేరం కాదు.”

 

“కానీ ఆ అమ్మాయిని మోసం చేయడం నేరం.”

 

మండపం మరింత నిశ్శబ్దంగా మారింది.

 

“అబద్ధం!”

 

అని రాఘవ తండ్రి గట్టిగా అరిచాడు.

 

“అయితే రాఘవ నన్ను చూసి ఎందుకు భయపడుతున్నాడు?”

 

అని శ్రీను ప్రశ్నించాడు.

 

రాఘవ తల వంచుకున్నాడు.

 

ఆ క్షణం వల్లీ గుండెలో భయం పెరిగింది.

 

కానీ…

 

కొద్దిసేపటి తర్వాత శ్రీను చెప్పిన నిజం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

రాఘవ కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు.

 

వాళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.

 

కానీ రాఘవ కుటుంబం ఒప్పుకోలేదు.

 

ఎందుకంటే…

 

ఆ అమ్మాయి పేదది.

 

చివరికి రాఘవ కుటుంబ ఒత్తిడికి లొంగిపోయి ఆ అమ్మాయిని వదిలేశాడు.

 

ఆమెలో ఇప్పుడు మరో జీవం ఉంది.

 

“ఇదే నిజం.”

 

అన్నాడు శ్రీను.

 

అందరూ ఒకరినొకరు చూసుకున్నారు.

 

వల్లీ తండ్రి కూడా కాసేపు ఆలోచించాడు.

 

ఇది బాధాకరమైన విషయమే.

 

కానీ…

 

పెళ్లి ఆపేంత పెద్ద కారణం కాదు.

 

ఎందుకంటే పీటలా మీద పెళ్లి ఆగిపోతే మళ్ళీ వల్లికి పెళ్లి అవుతుందా??

 

వీళ్లు మళ్ళీ ఇంత ఘనంగా ఉన్నంత లో పెళ్లి చెయ్యగలరా అని సందేహం….

 

అది అర్థం చేసుకున్న శ్రీను కూడా తలదించుకున్నాడు.

 

“నేను నా చెల్లెలికి జరిగిన అన్యాయం గుర్తు పెట్టుకుని వచ్చాను.”

 

అన్నాడు.

 

“కానీ ఇప్పుడు నిర్ణయం మీది.”

 

అంతే.

 

అతను అక్కడి నుండి వెళ్లడానికి ఒప్పుకోలేదు వీళ్లు బలవతంగా తన్ని తరిమెసారు.

 

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

 

మండపంలో మళ్లీ ముహూర్తం పనులు మొదలయ్యాయి.

 

వల్లీ మాత్రం ఆలోచనల్లో పడిపోయింది.

 

రాఘవ నిజంగా మంచివాడేనా?

 

లేక తన భావాలను అవసరానికి తగ్గట్టు మార్చుకునే వ్యక్తినా?

 

కానీ…

 

ఆమెకు ఇప్పుడు వెనక్కి వెళ్లే అవకాశం లేదు.

 

కొద్ది క్షణాల తర్వాత…

 

రాఘవ వల్లీ మెడలో తాళి కట్టాడు.

 

అక్షింతలు పడ్డాయి.

 

మంగళవాయిద్యాలు మోగాయి.

 

అందరూ చప్పట్లు కొట్టారు, ఆశీర్వదించారు.

 

అలా…

 

వల్లీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.

 

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

 

వల్లీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది…

 

తను అత్తగారింటికి పయనమైంది….

 

గుమ్మం వద్దే రాఘవకి చెల్లి వరస అయినా వాళ్లు హరటిపళ్లెం తో రెడీ గా ఉన్నారు.

 

ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని ఇంట్లోకి అడుగుపెట్టారు.

 

ఇల్లు మరీ పెద్దగా లేదు అలాగ అని మరీ చిన్నగా లేదు.

 

సుమారు ఒక మధ్య తరగతి వాళ్లు నివసించడానికి వీలుగా బాగుంది.

 

మరుసటి రోజుకి వ్రతం జరిపారు నూతన దంపతులు.

 

అదే రోజు రాత్రి ఇద్దరికీ కార్యం ఏర్పాటు చేసారు కానీ అది ఇద్దరు ఒకరిని ఒకరు తెలుసుకోవడం కోసం వాయిదా వేసుకున్నారు.

 

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

 

మూడు నెలల తర్వాత

 

మొదటి కొన్ని రోజులు బాగానే గడిచాయి.

 

రాఘవ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు.

 

కానీ వల్లీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు.

 

అత్తగారు కూడా బయటికి చాలా మంచిగా కనిపించేది.

 

దాంతో…

 

వల్లీకి కాస్త ధైర్యం వచ్చింది.

 

“బహుశా నా భయాలన్నీ అనవసరమేమో.”

 

అనుకుంది.

 

కానీ…

 

కొన్ని ముఖాలు సమయం గడిచేకొద్దీ అసలు రంగు చూపిస్తాయి.

 

💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫

 

ఒకరోజు…

 

అత్తగారు అకస్మాత్తుగా అడిగింది.

 

“ఏమైనా శుభవార్త ఉందా?”

 

వల్లీకి అర్థం కాలేదు.

 

“ఏ శుభవార్త అత్తయ్య?”

 

“అదే… మాకు మనవడు ఎప్పుడు వస్తాడు?”

 

వల్లీ ముఖం ఎర్రబడింది.

 

ఆ రోజు మొదలైన మాట…

 

తర్వాత ప్రతి రోజూ వినిపించడం మొదలైంది.

 

“మన ఇంటికి వారసుడు కావాలి.”

 

“మగపిల్లాడు పుట్టాలి.”

 

“ఆస్తి అంతా అతనికే వెళ్తుంది.”

 

ఈ మాటలు వల్లీకి కొత్తగా అనిపించాయి.

 

ఆమెకు అబ్బాయి , అమ్మాయి అనే తేడా తెలియదు.

 

కానీ…

 

ఆ ఇంట్లో మాత్రం ఆ తేడా చాలా పెద్దది.

 

💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫

 

ఆరు నెలల తర్వాత…

 

వల్లీ గర్భవతి అయింది.

 

ఇంట్లో అందరూ సంతోషించారు.

 

ముఖ్యంగా అత్తగారు.

 

“ఈసారి మనవడే వస్తాడు.”

 

అని గర్వంగా చెప్పింది.

 

నెలలు గడిచాయి.

 

డెలివరీ రోజు వచ్చింది.

 

వల్లీకి పాప పుట్టింది.

 

చిన్నారి చాలా అందంగా ఉంది.

 

కానీ…

 

ఆమెని చూసి సంతోషించిన వాళ్లు చాలా తక్కువ.

 

పుట్టింటి వాళ్లు కూడా నిరాశగానే ఉన్నారు కారణం అత్తింటి వాళ్ల మాటలు.

 

అంజి అయితే అంజలి మీద చెయ్యి చేసుకున్నాడు.

 

కారణం అత్తింటి వాళ్లు మాటకి ముందు వెనక అన్ని అమ్మ పోలికలే అందుకే కూతురు పుట్టింది అత్త పోలికలు రాలేదు అని….

 

(అత్త పోలికలు ఎందుకు వస్తాయి అసలు కనింది అమ్మ అయితే అందులోను ప్రతి సారి అమ్మాయి వైపే ఎందుకు వేలెత్తిచుపిస్తారు??

 

అమ్మాయి పుట్టడం అబ్బాయి పుట్టడం అది కంప్లీట్ గా అబ్బాయి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది!!!

 

కారం తెలిసిన వాళ్లు కామెంట్ చెయ్యండి నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో రెవిల్ చేస్తాను…)

 

ఇవ్వనీ విన్న వల్లీ చాలా బాధపడింది.

 

కన్నీళ్లతో తన కూతురిని హత్తుకుంది.

 

“నువ్వే నా ప్రపంచం.”

 

అంది.

 

కానీ బయట…

 

అత్తగారి ముఖం అసహనంగా మారింది.

 

“మళ్లీ ప్రయత్నిద్దాం.”

 

అని గట్టిగా అంది.

 

ఆ మాట వల్లీకి చాలా బాధ కలిగించింది.

 

పాప పుట్టింది…

 

అది ఆనందం కావాలి.

 

కానీ…

 

ఆ ఇంట్లో అది నిరాశగా మారింది.

 

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

 

రోజులు గడిచాయి.

 

చిన్నారి పెరుగుతోంది.

 

తనని ఆ ఇంట్లో వల్లీ తప్ప ఎవ్వరు దగ్గరికి తీసుకోవట్లేదు ఆఖరికి రాఘవ కూడా…

 

కానీ వల్లీ తన కూతురితో చాలా సంతోషంగా ఉంది.

 

తన ఆలాణపాలన చూసుకుంటుంది.

 

కానీ…

 

ఇంట్లో పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి.

 

ముందు ప్రేమగా మాట్లాడిన అత్తగారు…

 

ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు కోప్పడుతోంది.

 

రాఘవ కూడా మెల్లిగా మారుతున్నాడు.

 

“అమ్మ చెప్పింది విను.”

 

“వాళ్ల మాటకి ఎదురు చెప్పొద్దు.”

 

అనే మాటలు పెరుగుతున్నాయి.

 

వల్లీకి ఏదో తేడా కనిపిస్తోంది.

 

కానీ…

 

అది ఇంకా తుఫాన్ కాదు.

 

కేవలం గాలి మాత్రమే.

 

నిజమైన తుఫాన్ ఇంకా రావాల్సి ఉంది.

 

💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫

 

ఒకరోజు రాత్రి…

 

రాఘవ తండ్రి ఒక ఫైల్ తీసుకుని వచ్చాడు.

 

అందులో పాత ఆస్తి పత్రాలు ఉన్నాయి.

 

“ఇవన్నీ మన కుటుంబ వారసత్వం.”

 

అన్నాడు.

 

“ఇవి బయటివాళ్లకి వెళ్లకూడదు.”

 

“అందుకే మనకి మగ వారసుడు అవసరం.”

 

ఆ మాటలు విన్న వల్లీ…

 

మొదటిసారి అసలు కారణం అర్థం చేసుకుంది.

 

వాళ్లకి మనవడు కావాలి.

 

ప్రేమ కోసం కాదు.

 

కుటుంబం కోసం కాదు.

 

ఆస్తి కోసం.

 

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

 

ఆ రాత్రి…

 

వల్లీ తన పాపని గట్టిగా హత్తుకుని పడుకుంది.

 

తెలియకుండానే ఆమె కళ్లలో నీళ్లు వచ్చాయి.

 

ఎందుకంటే…

 

తన కూతురిని ఎవ్వరూ పూర్తిగా అంగీకరించడం లేదనే నిజం ఆమె గుండెను ముక్కలు చేసింది.

 

కానీ…

 

ఆమెకి తెలియదు.

 

ఇది కేవలం ఆరంభం మాత్రమే అని.

 

ముందు ముందు…

 

ఈ ఆస్తి…

 

ఈ వారసత్వం…

 

ఈ మగబిడ్డ అనే మోజు…

 

ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కంటిన్యూస్…..

 

నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో:-

 

ఆస్తి కోసం మొదలైన ఆశలు… వల్లీ జీవితాన్ని నెమ్మదిగా బంధించబోతున్నాయి…

 

అయితే ఈ మార్పులను వల్లీ గుర్తిస్తుందా? 

 

రాఘవ నిజంగా తన భార్యకు అండగా నిలుస్తాడా? 

 

లేక కుటుంబం కోసం వల్లీని ఒంటరిగా వదిలేస్తాడా? 

 

ఎలా అనిపించింది ఎపిసోడ్?? కామెంట్స్ లో తెలుపండి. 

 

మీ కామెంట్స్ కాయిన్స్ అందిస్తారని ఆశిస్తూ……

 

 

ఇంకోసారి ఇంకో ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను…

 

 

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.