సిరియస్ గా చూస్తున్న అభి ని చూసి భయపడుతూ ఉంటుంది ధరణి……
“ఏయ్ , ఏంటి నువ్వు నీకు ఆ రింగ్ టోన్ తప్ప ఇంకా ఏమి దొరకలేదా , నువ్వు ఏమైన పాత కాలం దానివా, నువ్వు నీ సాంగ్ లు, నేను వచ్చేసరికి నాకు సాంగ్ వినపడిందో నీకు మాములుగా ఉండదు” అని అంటున్న అభి ని చూసి “ఆ రింగ్ టోన్ పెళ్లి కి ముందు నుంచి ఉంది అండి , అది పాత కాలం సాంగ్ కాదు కదండి” అని అంటుంది…….
“ఏంటి, నోరు లేస్తుంది నేను ఏం చెప్పానో అది చేయి అర్థమైందా, పోనిలే అని ఊరుకుంటుంటే నాకే ఎదురు చెప్తున్నావ ” అని అంటే “అది కాదండి , నేను ” అని అంటున్న ధరణి తో “హే జస్ట్ స్టాపిట్, పో బయటికి ” అని సిరియస్ గా అంటాడు…….
“నేను చెప్పేది ” అని అంటుంటే “పో ” అని అనడంతో సైలెంట్ గా బయటికి వచ్చి సోఫా లో కూర్చుని “ఇప్పుడు నేనేం చేసా అని నా మీద అంత సిరియస్ అయ్యారు. ఈ ఫోన్ కూడా ఇప్పుడే రావాల, అయిన నా రింగ్ టోన్ తో ఆయనకు ఎందుకో అంత ప్రాబ్లం, నేను ఎందుకు మారుస్తా అసలు మార్చను ” అని అనుకొని వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళుతుంది……