ఆర్య అలా కార్ మిద ఎక్కిస్తాడు అని ఊహించని రూప ….. ఎక్కడ కార్ మిద నుంచి జారి కింద పడి … తన ప్రేతాత్మ అలా గాల్లోకి వెళ్లిపోతుంది ఏమో అని భయపడుతూ అరుస్తూ ఉంటుంది.
కార్ లో ఉన్న ఆర్య మాత్రం రూప అరుపులు విని ఎంజాయ్ చేస్తూ కార్ నీ స్లో చేస్తూ ఉంటాడు.
ఒక ఐదు నిమిషాలు రూప నీ బాగ ఏడిపించి , భయపెట్టి … ఇంకా ఎక్కువ ఏడిపించడం ఇష్టం లేక కార్ నీ మళ్ళీ ఒక సైడ్ కి ఆపి …
కార్ దిగి వెళ్లి కార్ బ్యాన్నెట్ మిద కాలు మిద కాలు వేసుకొని కూర్చొని , తల కింద చేతులు పెట్టుకొని , అలా ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉంటాడు.