అందని జాబిల్లి – 3
అందమైన పాదాలు ఆ పాదాలకి గుత్తులు గుత్తులుగా ఉన్న మువ్వల పట్టీలు… పాదం వెనుక మడం కింద ఆవగింజంత పుట్టుమచ్చ అది ఆ పాదాలకి మరింత అందాన్ని తీసుకువచ్చింది
అడుగులు వేస్తుంటే ఆ మువ్వల పట్టీల లోంచి వస్తున్నా శబ్దం అతడు చెవులకి వినసంపుగా వినిపిస్తుంది
వైట్ కలర్ లంగా వోణీలో గాలికి ఎగురుతున్న పైట చెంగు వల్ల ఆమె వయ్యారాలు పోతున్న సోయగాలు కన్నులకు కనువిందుగా దర్శనం చేస్తున్నాయి
వెనకనుంచి ఊరించి కవ్విస్తున్న ఆ అందాల సౌందర్య లహరి ముఖారవిందం చూడాలని వెనక నుంచి ముందుకి అడుగులు వేస్తూ వెళ్తాడు
ఇంకొక అడుగు వేస్తే ఆమె కనిపిస్తుంది అనగా ఫుల్ సౌండ్ తో రింగ్ అయిన ఫోన్ ట్యూన్ కి ఉలిక్కిపడి లేస్తాడు అన్వేష్ ( మన హీరో )
మంచి కల డిస్టబ్ అయినందుకు విసుగ్గా లేచి ఫోన్ చూసినా అతనికి అది తన అత్త నుంచి వస్తున్న ఫోన్ కావడంతో వెంటనే మూడ్ మారిపోయి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు
హలో చిన్నా !! ఎక్కడున్నావ్ నాన్న నైట్ కూడా ఇంటికి రాలేదు సరేలే ఫ్రెండ్ దగ్గర ఉన్నావేమో ఉదయాన్నే వస్తావేమో అని చూస్తున్నా టైం నైన్ అవుతుంది అయినా ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడున్నా నువ్వు? అని అడుగుతుంది వాళ్ళ అత్త
చెప్ప కదా అత్త ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తాను అని పార్టీ కొంచెం లేట్ అయింది అందుకే ఫ్రెండ్ రూమ్ కి వచ్చేసాను దగ్గర్లో ఉందని
నైట్ లేట్ అవ్వడం వల్ల ఉదయాన్నే మెలకువ రాలేదు ఇప్పుడే నీ ఫోన్ కాల్ తో లేచాను… అరగంటలో ఇంటికి స్టార్ట్ అవుతాను అత్త అని అంటాడు
సరే చిన్న తొందరగా వచ్చేయ్ నీకోసం మేము వెయిట్ చేస్తున్నాం అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు
” ఇప్పుడు మనం అన్వేష్ గురించి తెలుసుకుందాం “
అన్వేష్ 25 సంవత్సరాల యుక్త వయసు యువకుడు… ఎం ఎస్ సి చేసి గ్రాడ్యుయేషన్ అందుకున్నాడు… సొంతగా కంపెనీలు ఉన్న వాటిని హ్యాండ్ ఓవర్ చేయకుండా తనకంటూ ఒక కల ఉంది అని చెప్పి ఆ కల కోసం అవన్నీ వదిలేశాడు
స్వతః అన్వేష్ చాలా బ్రేవ్ బాయ్…. ఏదైనా ఒక విషయం విన్నాడు అంటే కచ్చితంగా దాని మూలాలను అన్వేషిస్తూ పూర్తి సమాచారం తెలుసుకునే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తాడు
ఎటువంటి విషయమైనా తెలుసుకొనే వరకు వదలడు… టూరిజం చేయడం అంటే చాలా ఇష్టం
అన్వేష్ కి అమ్మానాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారు
అందువల్ల అతని మేనత్త దగ్గరే ఉంటాడు చిన్నప్పటి నుంచి ఆవిడే ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకున్నారు
ఆవిడకి ఒక్కతే కూతురు కాబట్టి అన్వేశ్ నీ సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకోవడం మొదలు పెట్టారు
అన్వేష్ వాళ్ళ అత్తకి అతను అంటే పంచప్రాణాలు… కూతురిని తనకిచ్చి పెళ్లి చేసి ఆమే ఎంఫైర్ కి రాజుని చేయాలని ఆమె ఆశ
కానీ ఇప్పటి వరకు ఈ విషయం అన్వేష్ వరకు రాలేదు…మరి ఆవిడ ఆశ నెరవేర్పుతుందో లేదొ ముందు ముందు కథలో తెలుసుకుందాం
@@@@@
ఏంటి లక్ష్మి నీ కళ్ళు అంత నీరసంగా వాడిపోయి ఉన్నాయి నీ బజ్జులో ఉన్న బేబీ నిన్ను ఇబ్బంది పెడుతుందా అని అడుగుతుంది మోక్ష
అవును అన్నట్లుగా తల నిలువుగా ఉపేసరికి… ఇంకెన్ని రోజులులే ఇంకొక వారం రోజుల్లో నీకు ఈ బరువు తగ్గిపోతుంది అని చెప్పి
అవును వచ్చిన విషయమే మర్చిపోయాను సుకుమారి కి బలం తక్కువగా ఉంది అందుకే ఇప్పుడు నువ్వు పేడ వేస్తే తీసుకు వెళ్ళడానికి వచ్చాను పేడ వేసేయ్ అని అంటూ తనతో పాటు తెచ్చిన బకెట్ నీ ఆవు వెనుక పడుతుంది
కాసేపు చూసి విసుగు వచ్చి మనం ఫ్రెండ్స్ కదా ఈ ఫ్రెండ్ మాట వినవా నువ్వు ? ఇలా అయితే ” ఐ హార్ట్ ” నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఒక అడుగు వెనక్కి వేసిందో లేదో ఆ బకెట్ నింపేసరికి హ్యాపీ స్మైల్ వచ్చేస్తుంది మోక్షా పెదవుల పై
” థాంక్యూ ఫ్రెండ్ థాంక్యూ సో మచ్ ” అని చెప్పి దానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి అది తీసుకొని ఇంటికి వెళ్లి గార్డెన్ లో ఉన్న తన గులాబీ మొక్క దగ్గరికి వెళ్తుంది
హాయ్ సుకుమారి !! నీకోసం ఏం తెచ్చానో చూడు అని అది వింటున్నట్లుగా పలకరిస్తూనే ఆ మొక్క చుట్టూ గొప్పు తవ్వి తనతో పాటు తెచ్చిన ఆవుపేడని దాని చుట్టూ వేస్తుంది
ఇదిగో నీకు బద్ధకం ఎక్కువైపోయి కొన్ని రోజుల నుంచి అసలు పువ్వులే పూయడం లేదు అందుకే నీకు కొంచెం ఎనర్జీ తగ్గిందేమో అని ఇది తెచ్చి వేసాను ఇప్పటికైనా నీ బద్దకాన్ని కట్టిపెట్టి పువ్వులు పూయు మా దేవికి నీ పువ్వులు అంటే చాలా ఇష్టం అని ఆ మొక్కతో కాసేపు మాట్లాడి ఇంట్లోకి వచ్చేస్తుంది
అయ్యాయా అమ్మ నీ షికార్లు ఊసులు స్నేహాలు అని వెటకారంగా ఆడుగుతుంది రమణి
ఇంకా అవ్వలేదు పెరటి వెనుక ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలి అని నవ్వుతూ అంటుంది మోక్ష
ఎంతసేపు మొక్కలు చెట్లు ఆవులు గేదలు జంతువులు వీటితో తిరగడం తప్ప వేరే పనేం లేదు నీకు… అయ్యో బామ్మ ముసల్ది అయిపోయింది ఇంట్లో కష్టపడుతుంది ఆ ముసలి దానికి ఏమైనా సహాయం చేస్తాను అన్న ఆలోచన రావడం లేదు… నీ తోటి పిల్లలందరూ నీలాగే ఉంటున్నారా అని చిరుకోపంగా అడుగుతారు
నిజమే నా తోటి పిల్లలు ఎవరు నాలా ఉండడం లేదు వాళ్ళందరూ చక్కగా స్నేహితులతో ఊర్లో వాళ్ళ అందరితో స్నేహాలు చేస్తూ అందరితో కలిసి వెళ్లి చదువుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు
కానీ నేను ?? ఏం పాపం చేశానని ఆ దేవి నాకు ఈ శిక్ష వేసింది ?? ఎంతసేపు జంతువులతో పక్షులతో చెట్లతో మాట్లాడుతూ తిరుగుతావు నువ్వు పిచ్చి దానివి అని నన్ను తిడుతున్నావ్
ఏం చేయను మరి నాకున్న ఆత్మీయ స్నేహ బంధాలు వాళ్లతోనే కదా !! వాళ్లు తప్పితే నాతో మాట్లాడే వాళ్లు ఎవ్వరూ ఉండరు కదా ?? ఊర్లో ఎవరిని పలకరించిన మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు కనీసం ఎదురుగా నేనొక మనిషిని ఉన్నాను అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు
ఎందుకు ఎందుకు నేనంటే అందరికీ అంత ఏహ్య భావం ?? అని బాధగా అడుగుతుంది కళ్ళల్లో చేరిన కన్నీటితో
అయ్యో పిచ్చిదాన్ని నవ్వుతూ వచ్చిన పిల్లని ఏడిపించాను కదా… నేనొక పిచ్చిదాన్ని ఏడవకు తల్లి నువ్వు నా బంగారానివి కదూ నీకు ఆ ఊరు అంతటితో పనేముంది నేను మీ తాతయ్య లేమా
” మా పంచ ప్రాణాలు నువ్వు ” నువ్వంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఎవరు నిన్ను ఇష్టపడకుండా ఉండరు
ఏడవకు తల్లి ఏడిస్తే మళ్ళీ మీ తాతయ్య మనసు బాధపడుతుంది ఆయన వచ్చేసరికి నువ్వు నవ్వుతూ ఉండాలి వెళ్లి మొహం కడుక్కొని ఇందాకటి నుంచి పెరట్లో ఉన్న నీ స్నేహితులు నిన్ను రమ్మని పిలుస్తున్నాయి ఎక్కువ గాలి వేస్తూ
వెళ్లి వాటితో కాసేపు కాలక్షేపం చేసి రా ఈ లోపు నేను నీకు ఇష్టమైన వంట చేస్తాను అని చెప్పి మోక్ష కళ్ళు తుడిచి అక్కడి నుంచి వంట గదిలోకి వెళ్తారు రమణి గారు
ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది కానీ నాకంట కన్నీరు చూస్తే విలవిల్లాడిపోతుంది ఏంటో ఈ ముసలిది అని చిన్న చిరునవ్వుతో అనుకుంటూ తన రూమ్ లోకి వెళుతుంది
@@@@@
అదొక పెద్ద బంగ్లా బంగ్లా అనేకన్నా మాన్షన్ అంటే కరెక్ట్ ఏమో
బయట ఎంట్రెన్స్ గేట్ దగ్గర నుంచి లోపల ద్వారం వరకు ఒక పది కిలోమీటర్ల దూరం ఉంటుంది… మధ్యలో మొత్తం గార్డెన్ ఒక సైడు పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్ల కింద టేబుల్స్ చైర్స్
మరొకవైపు చిన్నచిన్న పూల మొక్కలు కూరగాయలు అందంగా తోటలా కనిపిస్తుంది… కరెక్ట్ గా సింహ ద్వారానికి ఇరవై అడుగుల దూరంలో పార్వతీ పరమేశ్వరుల వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది
” రుద్రమ దేవినేని ఉమ శ్రీ నిలయం ” అని అందంగా శిల్పాల చేత చెక్కిన పెద్ద పెద్ద అక్షరాలతో నేమ్ బోర్డు కనిపిస్తుంది
లోపలికి వెళ్లేసరికి విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేయించి తెప్పించిన ఇంటీరియర్ డిజైన్స్… ఖరీదైన బొమ్మలు… మిలా మిలా మెరుస్తున్న మార్బుల్స్… ఎటు చూసినా కాస్ట్లీ ఫర్నిచర్…
కరెక్ట్ గా హాల్ మధ్యలో అటు ఇటు పెద్ద సోఫాలు ఉంటే వాటి మధ్యలో సింగిల్ సీటర్ సోఫా ఒకటి ఉంటుంది
ఆ సోఫాలో కాంజీవరం పట్టుచీర కట్టుకొని , నుదుటిన పెద్ద స్టిక్కర్ , పాపిట్లో లో కుంకుమ , కాలర్ నెక్ బ్లౌజ్ , ఒక చేతికి మినిమం పది తులాలు ఉండే పెద్ద సైజ్ కడియం లాంటి గాజు , మరొక చేతికి 10 లక్షల విలువ చేసే బ్రాండెడ్ కాస్ట్లీ వాచ్ , కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న 45 ఏళ్ల ఆవిడ కనిపిస్తుంది
ఆవిడ మరెవరో కాదు అన్వేష్ వాళ్ళ అత్త ” రుద్రమ దేవినేని ఉమాశ్రీ ” గారు అందరూ ఉమా అని అంటారు కానీ వల్ల ఆయన మాత్రం రుద్రా అని పిలుస్తారు
మామ్ !! బావకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు నీకు ఏమైనా తెలుసా ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లో లేడంట కదా అని అడుగుతూ కిందకి దిగి వస్తుంది ఆవిడ కూతురు అక్షిత
చేశాను బేబీ పార్టీకి వెళ్లి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు అంట… స్టార్ట్ అయ్యాను వచ్చేస్తాను అని చెప్పాడు అని అంటారు ఆవిడ
వాట్ !! ఫ్రెండ్ ఇంటికి వెళ్లడ ?? బావ ఫ్రెండ్స్ రేంజ్ ఏంటో నీకు బాగా తెలిసి కూడా ఎలా ఒప్పుకున్నావు మామ్ అని చిరాగ్గా అడుగుతుంది బేబీ
స్టోరీ కంటిన్యూస్…..
ప్లీజ్ ప్లీజ్ మస్ట్ కామెంట్ మై డియర్ క్యూటిస్
Swipe left/right or tap the sides to turn pages