సూటిగా చురుకుగా తనని స్కాన్ చేస్తున్న అతని పదునైన చూపులకి, ఆ గొంతులోని సాఫ్ట్ నెస్ కి, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో షర్ట్ బటన్స్ పెట్టని అతని రఫ్ మెయింటినెన్స్ కి, హెల్ప్ చేయాలన్న ఆలోచన ఏం మాత్రం లేని అతని ఆటిట్యూడ్ కి.. చాలా డిఫరెంట్ గా ఉన్నాడు.
అసలు ఎవరు ఇతను, ఎందుకు నా చావుకి అడ్డుపడ్డాడు అనుకుంటూ ఎత్తు మీద నుంచి కిందకి పెడుతున్న కాలు పచ్చికలో ఉన్న రాయి మీద పడి పట్టు తప్పడంతో బాడీ బ్యాలెన్స్ తప్పి ముందుకు పడుతున్న సహస్ర ను తప్పించుకొని వెనక్కి అడుగులు వేశాడు రాజ్.
హ్యాండ్ పట్టుకుని సపోర్ట్ చేస్తే మే బి రాజ్ చేతిలో ఉండేదేమో, లేదంటే అతని గుండెల మీద వచ్చి వాలేదేమో.. ఏది చేయకుండా వెనక్కి వెళ్లిన రాజ్ ని ..అరుస్తూ కిందపడిన సహస్ర తల ఎత్తి చూసింది.