** అజేయ -111 **
ఎనిమిది వందల సంవత్సరాల కిందట అంతిమ విజ్ఞానంతో నిర్మితమైన ‘మహా కాల గుహ’, రసవిద్య ఆధారిత ఆల్కెమికల్ లాకింగ్ సిస్టమ్, భైరవ పీఠం, అజేయ ఖడ్గపు ఉనికి వంటి అంశాలను రాఘవ్ ఎంతో శాస్త్రీయంగా, ఎక్కడా నమ్మశక్యం కాని కల్పనలకు తావు లేకుండా, అద్భుతమైన పురావస్తు ఆధారాలతో వివరించాడు..
ఆ రీసెర్చ్ పేపర్ చదివిన ఎవరైనా సరే… చరిత్ర కేవలం యుద్ధాల గురించినదే కాదని, అది ప్రాణాలకంటే మిన్నగా ప్రేమను, ధర్మాన్ని కాపాడుకున్న ఇద్దరు ఆత్మల ప్రయాణమని గ్రహించక తప్పలేదు!
హైదరాబాద్లోని ఒక ప్రఖ్యాత కన్వెన్షన్ హాల్లో రాఘవ్ రీసెర్చ్ పేపర్ లాంచ్ మరియు ప్రెస్ మీట్ అత్యంత వైభవంగా జరుగుతోంది..
దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ మీడియా జర్నలిస్టులు, టీవీ ఛానెళ్ల రిపోర్టర్లు, కెమెరామెన్లతో ఆ హాల్ కిక్కిరిసిపోయింది..
స్టేజ్ మీద రాఘవ్, సియాలు పక్కపక్కనే కూర్చున్నారు. రాఘవ్ ధరించిన వైట్ సూట్, సియా ధరించిన రాయ్ బ్లూ శారీ ఆ సభకు ఒక ప్రత్యేకమైన రాజసాన్ని తెచ్చిపెట్టాయి..