New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 110
అజేయ Premium 6 min read

అజేయ – 110

       **  అజేయ -110  **

 

కానీ, రాఘవ్ తన కుడిచేతి పిడికిలిని గట్టిగా బిగించగానే… అతడి అరచేతిలో అదే స్వర్ణ ఖడ్గపు కాంతి రేఖ ప్లాస్మా రూపంలో మెరిసి, మళ్లీ ప్రశాంతమైపోయింది..

 

రాఘవ్ తన దేహంలో నిండిన ఆ అనంతమైన శక్తిని అనుభూతి చెందుతూ స్వచ్ఛంగా చిరు నవ్వు చిందించాడు… 

 

ఇకపై ఆ ఖడ్గాన్ని చేతులతో మోయాల్సిన అవసరం లేదు.. ఆ అజేయ శక్తి ఎప్పటికీ అతడి గుండెల్లో, అతడి ఆత్మలోనే ఒక ధర్మ రక్షణ కవచంలా నిలిచి ఉంటుందని అతడికి సంపూర్ణంగా అర్థమైంది!

 

 

రాఘవ్ దేహంలోకి ఆ దివ్య శక్తి విలీనమై, ఆ ప్రచండమైన కాంతి శాంతించగానే… పక్కనే ఉన్న **సియా** కళ్ల నుంచి ధారగా కన్నీళ్లు రాలాయి..

 

ఎనిమిది శతాబ్దాల వియోగం… గత జన్మలోని అసంపూర్ణ ప్రేమ… ఈ జన్మలో ఎదుర్కొన్న మృత్యు భయాలు, పోరాటాలు, ఆవేదనలు… అన్నీ ఆ క్షణంలో ఆనందాశ్రువులై కరిగిపోయాయి..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue