** అజేయ – 33 **
ఇంజన్ ఆఫ్ చేయగానే… ఒక్కసారిగా అడవిలోని నిశ్శబ్దం అతన్ని చుట్టుముట్టింది. కేవలం పక్షుల కిలకిలరావాలు, సెలయేటి నీటి శబ్దం, చెట్ల ఆకులు కదులుతున్న చప్పుడు మాత్రమే వినిపిస్తున్నాయి..
రాఘవ్ కార్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగాడు. అతని బ్రౌన్ లెదర్ బూట్లు అహోబిలం అడవి మట్టినీ ముద్దాడగా… గట్టిగా శ్వాస పీల్చాడు రాఘవ్…
ఆ గాలి తనకి ఊపిరి పోసింది.. ఆ గాలిలోనే తన ఊపిరి ఆగిపోయింది అని అనిపిస్తుంటే..చుట్టూ ఉన్న ఎత్తైన కొండల వైపు చూశాడు..
ఈ కొండలు, ఈ రాళ్లు… ఇవన్నీ తను ప్రతి రాత్రి కనే కలలోని బ్యాక్‌డ్రాప్‌కి సరిగ్గా మ్యాచ్ అవుతున్నాయి..