** అజేయ – 85 **
సియా కళ్ల నుండి రాలిపడిన ఆ ఒక్క కన్నీటి చుక్క వారి శతాబ్దాల విరహానికి స్వస్తి పలికినట్లుంది..
కానీ ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, గాలిలో ఒక వింతైన కంపనం మొదలైంది..
ప్యాలెస్ గోడలపై ఉన్న ప్రమిదల్లోని వెలుగు అకస్మాత్తుగా ఊగిసలాడింది. ఆ వెలుతురు నీడలు పడుతున్న దిశలో, ఆ విశాలమైన గదికి కుడి వైపున ఉన్న ఒక నల్లరాతి రాతి ఆవరణలో ఏదో మెరుస్తోంది..
రాఘవ్ మెల్లగా లేచి, సియా చేయి పట్టుకుని ఆ దిశగా అడుగులు వేశాడు..
అక్కడ ఒక భారీ, పురాతన దర్పణం నిలబెట్టి ఉంది. అది సాధారణ గాజుతో చేసింది కాదు..