** అజేయ – 86 **
చల్లటి ప్రశాంతమైన గాలి వారి ముఖాలను తాకింది. కానీ చుట్టూ చూసిన వారిద్దరి కళ్లు మాత్రం నిరాశతో మరియు షాక్‌తో అలా ఉండిపోయాయి..
అద్దం వెనుక ఉన్న రహస్య టన్నెల్ దాటి బయటకు వచ్చిన రాఘవ్, సియాలకు ఎదురైంది ఒక ఊహించని భయానక నిజం..
చల్లటి గాలి వారి ముఖాలను తాకినా, అక్కడ ఉన్న వాతావరణం నిశ్శబ్దంతో గడ్డకట్టుకుపోతోంది..
వాళ్లు బయటపడింది అహోబిలం అడవుల్లోకి కాదు ! అదొక నిగూఢమైన, భయంకరమైన లోయ..
వాళ్లు నిలబడిన ఆ ప్రదేశం చుట్టూ వందల అడుగుల ఎత్తున నిలువుగా ఉన్న నల్లరాతి కొండలు ఉన్నాయి..