** అజేయ – 91 **
” రేయ్ ఒకేసారి పొడవండిరా వీడిని!” అని.. అరవడమే ఆలస్యం..
మొదటి గుండా పదునైన వేటకత్తితో రాఘవ్ గుండెల వైపు దూసుకొచ్చాడు.
రాఘవ్ జరిపిన మూవ్‌మెంట్ వాళ్ళ కంటికి కూడా అందలేదు! అతడు సెకనులో వందవ వంతు కాలంలో ముందుకు జరిగి, ఆ గుండా వేటును గాల్లోనే తన అరచేత్తో అడ్డుకున్నాడు..
ఆ కత్తి రాఘవ్ చర్మానికి తగిలినా… అతడి రక్తంలో ఉన్న అజేయ రక్షణ తరంగాల వల్ల రాఘవ్ చేతికి ఒక్క గాయం కూడా కాలేదు!
జరిగింది చూసి ఆ గుండా కళ్లు తేలేసాడు.. అలానే ఆశ్చర్యం గా చూస్తున్న అతడి మణికట్టును పట్టుకుని ఒక్క ట్విస్ట్ ఇచ్చాడు..రాఘవ్