New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 79

అన్వాంటెడ్ లవ్ – 79

శ్రీరామ్ అలా అనేసరికి తనని అవాయిడ్ చేయడం బాగోదని ముగ్గురు స్టార్ట్ అయ్యారు దీప్తి సెండ్ చేసిన లొకేషన్ కి…

 

 

డైరెక్ట్ గా వెళ్లి పలకరిస్తే శ్రీరామ్ కి డౌట్ వస్తుందని మెల్లిగా జూహు బీచ్ కి రమ్మని దీప్తి కి మెసేజ్ చేసి కార్ ని నేరుగా బీచ్ రోడ్ పై పరుగులు పెట్టించాడు…

 

 

 

దీప్తి, అమృత బలవంతం చేయడంతో స్వర్ణ వాళ్లతో కలిసి జూహు బీచ్‌కి అయితే వచ్చింది కానీ… ఆమె మనసు మాత్రం ఆ ఆలోచనల మధ్యే ఉండిపోయింది..

 

 

 

​చుట్టూ జనాలు, పిల్లల కేరింతలు, సముద్రపు అలల శబ్దం… ఏవీ స్వర్ణ మనసుకు ప్రశాంతతను ఇవ్వడం లేదు. దీప్తి, అమృత తనని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తున్నా, స్వర్ణ చూపులు మాత్రం శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాయి. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి, ఆ సముద్రపు అలలు వచ్చి తాకే ఒక చోట ఒంటరిగా ఇసుకలో కూర్చుంది.. మోకాళ్లను రొమ్ముకు ఆనించి, వాటిపై గడ్డం ఆనించి, అనంతమైన ఆ సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue