New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 80

అన్వాంటెడ్ లవ్ – 80

అలల ఒడ్డున ఒంటరిగా గుండెల్లో ఏదో తెలియని భారంతో దిగులుగా కూర్చుని శూన్యంలోకి చూస్తున్న స్వర్ణ పక్కన వచ్చి కూర్చుంటూ ఏం ఆలోచిస్తున్నావ్ స్వర్ణ  అని ఆరాటంగా అంతే సున్నితంగా అడిగాడు ఇంద్ర…

 

 

పక్కన కూర్చున్న ఇంద్ర కి కాస్త స్పేస్ ఇచ్చి దూరం జరుగుతూ మీ ఫోన్ మీకేలా ఇవ్వాలని ఆలోచిస్తున్నాను సర్… అని తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఇంద్ర మొబైల్ తీసి ఇస్తూ చెప్పింది….

 

 

 

స్వర్ణ ఇస్తున్న ఫోన్ వైపు చూడకుండ ఆమె వైపు మాత్రమే చూస్తూ… నేను నా ఫోన్ గురించి ఇక్కడికి రాలేదు స్వర్ణ! నీకోసం వచ్చా… అన్నాడు తన కోసం పడుతున్న తపనతో…. 

 

 

 

తెలుసు!! అంది క్షణం ఆలస్యం చేయకుండా ఉప్పొంగుతున్న సముద్రాన్ని చూస్తూ…. నన్నెలా టార్చర్ చేయాలని కొత్త ప్లాన్స్ వేస్తూ ఇక్కడికి వచ్చావ్ అంది…. అప్పటివరకు ఒంటరిగా ఉన్నప్పుడు నరనరాన ప్రవహించిన ఏడుపుని గుండెల్లోనే దిగమింగుకుంటూ… ఒక్క కన్నీటి చుక్క కూడా బయటకి రాకుండా ఆపుకుంది… ఎందుకంటే తన కన్నీటిని ఇంద్ర ముందు పెట్టి తానొక బలహీనురాలిగా అతని ముందు నిలబడటం ఆమె ఆత్మగౌరవానికి ఇష్టం లేదు.. తన బాధ అతనికి ఆయుధం కాకూడదనే పట్టుదల ఆమె కళ్లలో క్షణకాలం మెరిసింది… 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue