ఒకవైపు స్వర్ణ మనసు కి కళ్లముందు కనిపిస్తుంది నమ్మాలి అనిపించేలా తను ఇచ్చిన నొప్పిని భరించి తన పంటి గుర్తులని గుండెపై దాచుకున్నాడంటే అతడి ప్రేమ నిజమేనా అని మనసు తుంది మాకు స్వర్ణ అదంతా వాడు కేవలం నిన్ను నమ్మించాలని మాత్రమే చేస్తున్నాడు… నిన్ను తీసుకు వెళ్లడం వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది… గతంలో వాడి ప్రవర్తన గుర్తు తెచ్చుకో అని మెదడు ప్రేరేపిస్తుంది…
కోపంగా ఇంద్ర ని చూస్తూ అక్కడి నుండి వచ్చేస్తుంటే స్వర్ణ ఎక్కడికి వెళ్తున్నావ్ ఆగు అని స్వర్ణ చేతిని పట్టుకుని ఆపేసాడు…
వదులు ఇంద్ర!! నీ నాటకాలు మరిక్కడైనా చెప్పు నా దగ్గర కాదు అని విధిలించుకుని తన ఫ్రెండ్స్ ఎక్కడున్నారా అని చూసి ఇంద్ర ఇక్కడకి వచ్చాడు అంటే ఇది సన్నీ దీపు లా పనే అనుకుని తను రూమ్ కి వెళ్ళిపోవాలనుకుని బీచ్ నుండి రోడ్ కి వైపు నడుస్తుంటే… సౌరబ్ కనిపించి హాయ్ అని పలకరించాడు…
సౌరబ్ ని గుర్తు పట్టిన స్వర్ణ ఇబ్బందిగా హాలో అంటే ఎలా ఉన్నారు సిస్టర్! ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ప్రెసెంట్ అని అభిమానంగా అడిగాడు…