తడిసిన జుట్టు మొహంపై రెప రెపలాడుతుంటే వాటిని వెనక్కి సర్దుతూ గాలికి లేస్తున్న టాప్ ని కిందకి సర్దుతూ వెకిలిగా నవ్వుతున్న వాళ్ళని భయంగా చూస్తూ వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళడానికి ముందడుగు వేస్తున్న స్వర్ణ బ్యాక్ ని టచ్ చేయాలని దగ్గరగా తీసుకెళ్లిన వాడి చేతిని అలాగే వెనక్కి మడిచాడు ఇంద్ర…
వాడి పెట్టిన ఆర్తనాధం బీచ్ లో సగం మందికి వినిపిస్తే ఆ అరుపుతో వెనక్కి తిరిగిన స్వర్ణ భయంతో బిగుసుకు పోయింది…
ఎర్రగా భగ భగ మండే సూర్యుడిని తలపిస్తున్న అగ్ని గోళలా వంటి కళ్లని చూడగానే ఒక్క క్షణం జడుసుకుంది స్వర్ణ….