అవును! ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి???? నా అనుమతి లేకుండా నన్ను ముట్టుకోవడం, ఎత్తుకోవడం ఒళ్ళోకి లాక్కోవడం ఇవన్నీ ఏంటి… నీకు ఆడదాని మీద అంత కోరికగా ఉంటే వెళ్ళు…. నీలాంటి వాళ్ళ కోసమే ఎదురు చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు అంది..
నేను కోరికతో నిన్ను పట్టుకున్నానా? అని ఆవేదనతో నిండిన స్వరంతో హీనంగా అడిగాడు ఇంద్ర…
అవును!! అని గట్టిగా అరిచి నీలోని మృగం కన్ను ఇప్పుడు నా మీద పడిందా?? అని ఆవేశంగా అడిగింది…
మృగమా???? నీ విషయంలో కోపంగా ఉన్నానేమో ద్వేషించనేమో కానీ ఎప్పుడైనా మృగంలా ప్రవర్తించనా స్వర్ణ?? అని స్వర్ణ మాటలు గుండె లోతుల్లో ఈటెల్లా గుచ్చుతుంటే ఆ నొప్పిని భరిస్తూ అడిగాడు…