అవధులు లేని ప్రేమ – 3
ఎప్పటిలానే నిద్రలేచి రెడీ అయ్యాను ఈరోజు కూడా నాన్న నాకన్నా ముందే లేచి నాకు కిచెన్ కి కనెక్షన్ కట్ చేసి తనే బ్రేక్ ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసాడు బ్రేక్ఫాస్ట్ చేసి నేను కాలేజీకి నాన్న స్కూల్ కి బయలుదేరాము
కళాని ఎక్కించుకొని కాలేజీకి వెళ్లి కాలేజీలో క్లాసెస్ మొత్తం అయ్యాక తిరిగి సాయంత్రం బయలుదేరుతుండగా కళ మైత్రి అని నన్ను గోకడం మొదలు పెట్టింది
నేను చిరాగ్గా ఆ గోకడం ఆపి విషయం ఏంటో చెప్పు అన్నాను కళ మా మంచి మైత్రి కదా ఈరోజు పానీ పూరి తిని ఇంటికి వెళ్దాం ప్లీజ్ చాలా రోజులైంది అంది
నేను కళ్ళు చిన్నవిగా చేసి తనని చూశాను కళ ప్లీజ్ మా వెళ్ళడానికి పది నిమిషాలు అక్కడ మనం తినడానికి పది నిమిషాలు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ముప్పై నిమిషాలు అంతే కదా వెళ్దాం ఒప్పుకో అయినా నీకు ఈ ఫ్రెండ్ అంటే లెక్కే లేదు నీ మాట నేను వినాలి కానీ నా మాట నువ్వు అసలు వినటమే లేదు అని ఓ భారీ డైలాగ్ కొట్టింది
అంత డైలాగ్ కొట్టాక ఇంకా దాంతో వాదన అనవసరం అని బండిని పానీపూరి షాప్ వైపు తిప్పాను
నేను కళా కలిసి పానిపురీ షాప్ దగ్గరికి వెళ్ళాం. నేను స్కూటీ పక్కకి పెట్టే లోపు కళా వెళ్లి అన్న ఓ ప్లేట్ పానీపూరి ఒక సమోసా చాట్ అని తన ఆర్డర్ చెప్పడం స్టార్ట్ చేసింది
నేను స్కూటీ పక్కన పెట్టి బండి దగ్గరికి వెళ్తుండగా ఎవరో నన్ను ఓ బొమ్మని నెట్టినట్టు పట్టుకొని వెనుకకు నెట్టారు నేను వెళ్లి వెనక తనను తరుముతున్న వ్యక్తి పై పడ్డాను సడన్గా అలా పడేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక ఇద్దరం కింద పడ్డ నేను మాత్రం తన మీదున్న…
ఏమైందో అర్థం అవడానికి నాకు అర నిమిషం పట్టింది అర్థమయ్యి భయంతో మూసుకున్న నా కళ్ళు తెరవగానే అతను రోడ్డు మీద తన చేతుల్ని తల కింద పెట్టుకొని తన మీద ఉన్న నన్ను నవ్వుతూ చూస్తూ ఉన్నాడు నేను కళ్ళు తెరవగానే పర్వాలేదు నేను మోసే బరువులోనే ఉన్నావు అన్నాడు
నేను వెంటనే తన మీద నుంచి లేచి పక్కన నిలబడి భయంగా నన్ను క్షమించండి అతను ఎవరో తెలియదు సడన్గా మీ మీదకు తోసేసాడు అందువల్లే పడ్డాను అని చెప్పాను
అతను కూడా లేచి నిలబడి నన్ను చేస్తూ ఏం పర్వాలేదు నీది ఈ ఏరియానేనా నిన్ను ఇక్కడ ఎప్పుడూ చూడలేదే అని అడిగాడు
ఇంతా జరుగుతున్న మా కళా ఆరాముగా పానీ పూరి తిని నా పక్కకు వచ్చి గుంట నేను ఓ ప్లేట్ కూడా తినేసా నువ్వు తినవా అని నన్ను అడిగింది
నేను దాని వైపు చిరాగ్గా చూసి తిరిగి అతని వైపు చూశాను అతడు పానీ పూరి తినడానికి వచ్చావా అని ఆ షాప్ అతన్ని పిలిచాడు
అతను పిలవగానే ఆ షాప్ అతను భయ్యా అంటూ వచ్చి అతని కుర్చీ వేసి అతని ఎదురుగా నిల్చున్నాడు
అతను కూర్చొని మమ్మల్ని చూపిస్తూ ఏం ఆర్డర్ ఇచ్చారు అని అడిగాడు ఆ షాప్ అతను సమోసా చాట్ భయ్యా అని చెప్పాడు అతను వెంటనే అందర్నీ పంపేయి వీళ్ళకి చాట్ తెచ్చివ్వు అని చెప్పాడు ఆ షాప్ అతను అలాగే భయ్యా అని అందరిని పంపేసి మా కోసం చాట్ చేయడం మొదలుపెట్టాడు చాలా జాగ్రత్తగా
అతను నిల్చునే ఉన్న మా ఇద్దరిని చూసి కూర్చోండి అన్నాడు భయంతో నేను కళా సైలెంట్ గా కూర్చున్నాం
అంతలో కొంతమంది అక్కడికి వచ్చారు అందులో ఒకడు నాధ్ భాయ్ వాడు తప్పించుకున్నాడు అని చెప్పాడు
అతను పోతే పోయాడు లే ఛోటు రేపైనా దొరుకుతాడుగా నన్ను చూపిస్తూ ఇక్కడ మీ భాబీ కూర్చుని ఉంది ముందు మీ భాబీ కి ప్రణామ్ చెప్పు అన్నాడు
నేను భయంతో బిగిసుకుపోయి చూస్తున్న కళా పరిస్థితి కూడా అలానే ఉంది ఇంచుమించు
అంతలో షాప్ అతనువచ్చి భాబి చాట్ అని నా చేతిలో కళా చేతిలో చాట్ పెట్టాడు ఇంత భయం లో ఇది ఎలా రా తినేది దేవుడా అని నేను అనుకుంటుండగా భయంతో ఏం చేయాలో అర్థం కాక కళా దాన్ని తినడం మొదలెట్టింది దానికి కనీసం నోరు కాలడం లేదా అనిపించింది నాకు
నా ఎదురుగా ఉన్న అతను నీ పేరు ఏంటి అని నన్ను అడిగాడు నేను చాలా నెమ్మదిగా తెలియని వాళ్ళకి నేను నా పేరు చెప్పను అని చెప్పాను
కళావైపు తిరిగి తన పేరేంటి అని అడిగాడు అతను అది తలతిప్పి నా వైపు చూసింది
నేను చెప్పొద్దు అన్నట్టుగా నా తలని ఊపాను
పేరు చెప్పకపోతే మా పరిస్థితి ఏంటి అంటారు ?
నక్షత్ర
Swipe left/right or tap the sides to turn pages