ఇంద్రజిత్ – 3
ఇంద్రజిత్ -4
“నువ్వు ఫోన్ చేసిన అమ్మాయి చచ్చిపోయింది” అని ఒక్క మాట చెప్పి ఇంద్రజిత్ ఆ ఫోన్ వైపు ఒక్క క్షణం చూసి, ఆ మరుక్షణం ఫోన్ నేల మీద బలంగా విసిరి కొట్టాడు.
అది ఎన్ని ముక్కలు అయిందో కూడా లెక్కలేది పెట్టలేనన్ని ముక్కలు అయిపోయింది.
ఏంటి కీర్తి చనిపోయిందా..? అసలు ఫోన్ మాట్లాడుతుంది ఎవరు..? హలో అని మనోజ్ మాట్లాడుతున్న ఫోన్ కట్ అయిన సౌండ్ రావటంతో మరొకసారి ఫోన్ చేశాడు.
కానీ ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అసలు ఏమైంది కీర్తి ఇండియా వెళ్ళిందా లేదా చనిపోయింది అని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని టెన్షన్ పడిపోయాడు.
ఇంద్రజిత్ కార్ లో ఉన్న కీర్తి వైపు ఒక్క క్షణం చూసాడు. ఆ మరు క్షణం తల పక్కకు తిప్పి చూసాడు. అక్కడ ఉన్న పనివాడు (నరేష్) భయంగా రెండు చేతులు కట్టుకొని సార్ అని దగ్గరకు రావటంతో,
” వెళ్లి బకెట్ నిండా వాటర్ తీసుకొనిరా..?” అని అన్నాడు..
ఓకే సార్ అంటూ అతను వెళ్లి వాటర్ తీసుకొని రావటం ఆ బకెట్ ఇంద్ర తీసుకొని ఫోర్స్ గా కీర్తి ఫేస్ మీద కొట్టటం క్షణాల్లోనే జరిగిపోయింది..
చల్లటి నీళ్లు ఒక్కసారిగా ఒళ్లంతా తడవడంతో ఆమె ఉలిక్కిపడి కళ్లు తెరిచి వర్షం తుఫాను అని అరుస్తూ ఊపిరి బలంగా పీల్చుకుంటూ గబగబా లేచి కూర్చుంది. క్షణం పాటు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చుట్టూ చూసింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. నీళ్లు ముఖం మీద నుంచి జారిపడుతుండగా తన ఎక్కడ ఉందో అర్థం కాక చుట్టూ చూసింది. అప్పుడే ఎదురుగా నిలబడి ఉన్న ఇంద్రజిత్ ని చూసి ఆమె కళ్లలో భయం, కోపం ఒకేసారి వచ్చాయి.
అతడే తన మీద నీళ్లు పోసాడు అని అర్థమై ఆవేశంగా కారు దిగి “ఎందుకురా ఎందుకు నా మీద నీళ్లు పోసావు” అని అతడి మీదకు వెళ్ళింది.
ఆ మరుక్షణం ఆమె పీక పట్టుకొని ఒక అడుగు దూరంలోనే నిలబెట్టి “ఫస్ట్ ఈ కార్ క్లీన్ చెయ్” అని అన్నాడు ఇంద్ర.
“ఏంటి నేను ఈ కారు క్లీన్ చేయాలా..? నేను ఏంటో నా స్టేటస్ ఏంటో తెలుసా..? నన్ను కారు క్లీన్ చేయమంటావా..?” అని ఆమె అంటుంటే,
అతని చేతి పట్టు క్షణక్షణానికి బిగుసుకుంటుంది అప్పటి వరకు మాట్లాడిన ఆమె మాట్లాడలేక ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంటే దగ్గుతూ కష్టంగా “చేస్తాను కార్ క్లీన్ చేస్తాను” అని అన్నది. అప్పటికే ఒక ఇంచు గాల్లో పైకి లేచింది.
ఇంకా ఎక్కువ సేపు అలానే అతను పట్టుకొని ఉంటే చనిపోతాను అన్న భయం ఆమెలో పెరిగిపోవటంతో కారు క్లీన్ చేస్తాను అని చివరికి ఒప్పుకుంది.
“కారు అద్దంలా తల తల మెరుస్తూ ఉండాలి, ఆ విధంగా క్లీన్ చేయాలి” అని కీర్తి కి చెప్పి,
” చూస్తూ ఉండు ఒకవేళ తను కారు క్లీన్ చేయకుండా తప్పించుకోవాలి అని చూస్తే నువ్వు చస్తావు” అంటూ పక్కన ఉన్న నరేష్ ని బెదిరించి మరి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు ఇంద్రజిత్.
ఆ నరేష్ కు ఏమీ అర్థం కాక అయోమయంగా వాళ్ళ వైపు చూశాడు. ఇంద్రజిత్ లోపలికి వెళ్ళిపోవటంతో కీర్తి వైపు తిరిగి చూశాడు.
ఆమె కోపంగా ఇంద్రజిత్ వైపు చూస్తూ “నేను కారు క్లీన్ చేయాలా..? లగ్జరీ కార్లలో తిరిగే నేను కారు క్లీన్ చేయాలా..?” అని కాలునీ నేలమీద కొట్టుకుంటూ పిడికిలి బిగిస్తూ పళ్ళు నూరుకుంటూ లో లోపలే అనుకుంటుంది. గట్టిగా అరిస్తే మరొకసారి అక్కడ వచ్చి తన పీక పట్టుకుంటాడు ఏమో అన్న భయంతో పైకి అనలేకపోయింది.
ఆమెని ఇంతకుముందు ఎప్పుడూ చూడకపోవటం, అంతకుమించి ఇంద్రజిత్ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇంటికి తీసుకుని రావడం, ఆ అమ్మాయిని కారు క్లీన్ చేయమని చెప్పటంతో ఆమెను ఏమని పిలవాలో కూడా అర్థం కాక అయోమయంగా రెండు నిమిషాలు చూసాడు నరేష్..
“ఆ తర్వాత కారు క్లీన్ చెయ్ అమ్మాయి” అని నిలబడి అంతే కారు వైపు చూస్తూ ఉన్న కీర్తితో అన్నాడు నరేష్.
“రేయ్ నన్ను కారు క్లీన్ చేయమంటావా..?” అని నరేష్ మీదకు కీర్తి వెళుతుంటే,
అతడు అమాయకంగా బెదిరిపోతూ “సార్ చెప్పారు కాబట్టి మీరు ఈ పని చేయాల్సిందే” అని ఇంద్రజిత్ తరవాత తనకు ఇచ్చే పనిష్మెంట్ గుర్తుకు వచ్చి, భయంగా ధైర్యంగా చెప్పాడు..
నేను చెయ్యను అని ఆమె అక్కడ నుంచి తప్పించుకోవాలి అన్నట్లుగా చుట్టూ చూస్తూ ఉంది.
ముందు ఒక పెద్ద ప్యాలస్ తల ఎత్తి చూస్తే కింద పడిపోతారు ఏమో అన్నట్లుగా కనిపిస్తుంది. ఇక చుట్టూ మొక్కలు, మెయిన్ ఎంట్రెన్స్ గేట్ బయటకు వెళ్లడానికి ఎక్కడ అనేది కూడా కనిపించడం లేదు. ఎలా బయటకు వెళ్లాలి అని ఒక్క నిమిషం ఆలోచించి, ఎలాగైనా సరే అక్కడి నుంచి తప్పించుకోవాలి అని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది.
నరేష్ భయంతో అమ్మో ఈ అమ్మాయి ఇలా పరిగెడుతుంది ఏంటి.. సార్ కి తెలిసిందంటే నన్ను చంపేస్తాడు అని అనుకుంటూ ఆమె వెంట పరిగెత్తాడు.
కరెక్ట్ గా అప్పుడే అరవింద్ కారు కూడా అక్కడికి వచ్చి ఆగింది.
కీర్తి పరిగెత్తుకుంటూ వెనక వస్తున్న నరేష్ ని చూసుకుంటూ తప్పించుకోవాలి అని ఆ కారుకి ముందు పడింది.
సిద్ధార్థ అరవింద్ ఇద్దరూ కంగారుగా కారు దిగి చూశారు. కారు కింద కీర్తి పడిపోయి ఉండటం చూసి ఆమెకు ఏమైనా దెబ్బలు తగిలాయి ఏమో అని అనుకుంటూ దగ్గరకు వస్తున్నప్పుడే నరేష్ పరిగెత్తుకుంటూ రావటం గమనించి ఏమైంది అని అడిగాడు అరవింద్.
“సార్ ఇంద్ర సార్ ఈ అమ్మాయిని కారు క్లీన్ చేయమని చెప్పారు, ఈ అమ్మాయి ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు భయంగా ఉంది” అని అన్నాడు.
“అవునా అయితే ఈ అమ్మాయి కళ్ళు తెరిచిన తర్వాత కారు క్లీన్ చేయించు” అని చెప్పి అరవింద్ లోపలికి వెళ్ళిపోయాడు.
సిద్ధార్థ్ మాత్రం కారు కింద పడి ఉన్న కీర్తి వైపే జాలిగా చూస్తూ అరవింద్ వెనక ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. కనీసం కీర్తి ఎలా ఉంది ఆమెకు దెబ్బలు తగిలాయా లేదా అన్నది కూడా వాళ్ళు పట్టించుకోలేదు.
ఇదేంటి కనీసం కారు కింద పడితే ఎలా ఉంది ఏంటి అనేది కూడా పట్టించుకోకుండా కారు క్లీన్ చేయించు అని చెప్పి వెళ్ళిపోతున్నారు.
అసలు వీళ్ళు మనుషులేనా జాలీ దయ అనేది లేదా.. ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటుంటే వీళ్ళ మనసు కరగటం లేదా అని అనుకుంటూ పది నిమిషాలు అలానే కళ్ళు మూసుకొని ఉంది.
చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. అప్పటికి కూడా నరేష్ అక్కడే ఉండటంతో తప్పించుకునే దారి లేక ఏం చేయాలో అర్థం కాక మరో 10 నిమిషాల తర్వాత చిన్నగా కళ్ళు తెరిచి లేచి కూర్చొని “ఏం జరిగింది? నేను ఎక్కడ ఉన్నాను ఎవరు నువ్వు..?” అని అమాయకంగా అడిగింది.
“మేడం.. సార్ మిమ్మల్ని కారు క్లీన్ చేయమన్నారు, వచ్చి కారు క్లీన్ చేయండి మేడం. లేదంటే మా ప్రాణాలు పోతాయి. ప్లీజ్ మేడం” అని నరేష్ రిక్వెస్ట్ చేయడంతో,,
నిజమే ఆ రాక్షసుడు అనంతపని చేస్తాడు అని పళ్ళు నూరుకుంటూ అనుకుంది కీర్తి.
కొనసాగుతుంది.
ప్లీజ్ కామెంట్స్ పెట్టండి.
Swipe left/right or tap the sides to turn pages